• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!

|

అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చేపడుతుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇప్పటికే తన వారసుడిగా జస్టిన్ ఎన్వీ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేయడం, దానిని రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగిపోయాయి. కీలకమైన నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ సీజేఐ బోబ్డే గురువారం నాడు కొలీజియం భేటీ నిర్వహిస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీసింది. దీనిపై ప్రఖ్యాత 'ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కీలక కథనాలు రాసింది.

ఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్ -ఒడిశా పోలీసుల అలజడి -కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 -ఈసీకీ నో ఎంట్రీఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్ -ఒడిశా పోలీసుల అలజడి -కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 -ఈసీకీ నో ఎంట్రీ

ఇద్దరు జడ్జిల అభ్యంతరం

ఇద్దరు జడ్జిల అభ్యంతరం


సుప్రీంకోర్టులో కీలక పదవుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల గురించి చర్చించేందుకు ప్రస్తుత సీజేఐ బోబ్డే ఇవాళ(గురువారం) కొలీజియం భేటీని నిర్వహిస్తున్నారు. మొత్తం ఐదుగురు సభ్యులుండే కొలీజియంలో జస్టిస్ బోబ్డేతోపాటు కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ (యూయూ లలిత్), జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖన్విల్కర్ (ఏఎం ఖన్విల్కర్)ఉండగా.. కొలీజియం భేటీ జరపాలన్న సీజేఐ నిర్ణయంపై ఇద్దరు జడ్జిలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి ప్రధాన కారణం..

షాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామషాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామ

జస్టిస్ రమణ నియామకం తర్వాతా?

జస్టిస్ రమణ నియామకం తర్వాతా?

ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే, కేంద్రం సిఫార్సుల మేరకు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈనెల 6న ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ బోబ్డే పదవీ విరమణ చేసిన మరుసటి రోజే, అంటే ఏప్రిల్ 24న నూతన సీజేఐగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నియామక వారెంట్లు జారీ అయినందున మళ్లీ సీజేఐ ఎలాంటి సిఫార్సులు చేసినా అది సరైన విధానం కాబోదని ఆ ఇద్దరు జడ్జిల వాదన. నిజానికి..

కొలీజియంను విశ్వాసంలోకి తీసుకోరా?

కొలీజియంను విశ్వాసంలోకి తీసుకోరా?

తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే కొలీజయం సమావేశం షెడ్యూల్ (ఏప్రిల్ 8న భేటీ కావాలని) ఖరారైంది. అయితే, తదుపరి సీజేఐ నియామక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రస్తుత సీజేఐ బోబ్డే సదరు షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు చేయకుండా ఇవాళ భేటీకి సిద్ధమయ్యారు. దీనిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మాజీ సీజేఐ ఆర్ఎం లోథా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సిట్టింగ్ సీజేఐ తన పదవీకాలం ముగిసేలోపు వారసుడి పేరును నేరుగా సిఫార్సు చేయడంలో ఎలాంటి అభ్యంతరాలకు అవకాశం లేనప్పటికీ, ఆయన తన కొలీజియం సహచరులను ఎలా విశ్వాసంలోకి తీసుకుంటాడనే దానిపైనా నియామకం ఆధారపడి ఉంటుంది''అని లోథా అన్నారు. కాగా,

జస్టిస్ బోబ్డే ఉద్దేశం మరోలా ఉందా?

జస్టిస్ బోబ్డే ఉద్దేశం మరోలా ఉందా?


తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరు ఖరారైన తర్వాత కూడా షెడ్యూల్ మార్చకుండా కొలీజియం భేటీ నిర్వహిస్తుండటం వెనుక ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే ఉద్దేశం మరోలా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల కొరత ఉన్నప్పటికీ, తన 14 నెలల సుదీర్ఘ పదవీ కాలంలో బోబ్డే ప్రభుత్వానికి ఎలాంటి (చివర్లో వారసుడి పేరు తప్ప) సిఫార్సులూ చేయలేదు. మరో 15 రోజుల్లో బోబ్డే దిగిపోనుండగా ఇప్పటికిప్పుడు కొలీజియం సమావేశం ద్వారా ఖాళీగా ఉన్న ఐదు పోస్టులకూ సిఫార్సు చేయడం కోసం పేర్లను ఎంపిక చేస్తారా? అనేదీ చర్చనీయాంశమైంది. ఎందుకంటే..

  Telangana : లిక్కర్ షాపులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు లేవు - హైకోర్టు
  దేశానికి తొలి మహిళా సీజేఐ?

  దేశానికి తొలి మహిళా సీజేఐ?

  సీజేఐ బోబ్డే గురువారం నిర్వహించతలపెట్టిన కొలీజియం భేటీలో ఏ విషయాన్ని చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తదుపరి సీజేఐ ఇప్పటికే ఖరారైపోయారు గనుక, మిగిలిన ఖాళీల్లో భర్తీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే, సుప్రీంకోర్టు జడ్జిలు కాదగినవారి జాబితాలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. అందులో ఒకటి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అఖిల్ ఖురేషీ పేరు. గతంలో ఆయన నియామకంపై కేంద్రం అభ్యంతరం చెప్పింది. జస్టిస్ ఖురేషీని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేస్తే, కేంద్రం మాత్రం ఆయనను త్రిపుర హైకోర్టుకు పంపాలని రికమండ్ చేసింది. గత అనుభవాల రీత్యా ఖురేషీని సుప్రీంకోర్టులోకి తీసుకునే విషయంలో కొలీజియం ప్రభుత్వా ఆలోచనకు విరుద్ధంగా వెళ్లబోదనీ తెలుస్తోంది. కొలీజయం పరిశీలించే వీలున్న రెండో పేరు కర్ణాటక హైకోర్టు జడ్జి బీవీ నాగరత్న. కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నియమితురాలైతే గనుక జస్టిస్ నాగరత్న రాబోయే రోజుల్లో భారత తొలి మహిళా సీజేఐ అయ్యేందుకు చాలా అవకాశాలుంటాయి. సుప్రీంకోర్టులో చివరిగా 2019లో జడ్జిల నియామకం జరిగింది. ఈ ఏడాది జస్టిస్ బోబ్డేతోపాటు జస్టిస్ నారీమన్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నవీన్ సిన్హాలు రిటైర్ కానున్నారు. కొత్త నియామకాలకు సంబంధించి ఏరకంగా చూసినా సీజేఐ బోబ్డే ఇవాళ తలపెట్టిన కొలీజియం ఆసక్తికరంగా మారింది.

  English summary
  At least two judges of the Supreme Court are learnt to have expressed their reservations to Chief Justice of India Justice S A Bobde over his decision to hold a meeting of the collegium Thursday to discuss possible candidates for appointment to the apex court.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X