వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోసపోయిన చీఫ్ జస్టిస్ బోబ్డే తల్లి -నాగ్‌పూర్‌ ఆస్తులకు కేర్‌టేకర్ టోకరా -డీసీపీ వినితా ఎంట్రీతో..

|
Google Oneindia TeluguNews

ఆయన.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో.. అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి.. ప్రోటోకాల్ పరంగా రాష్ట్రపతి ప్రధమ పౌరుడైతే సీజేఐ ఆరో పౌరుడి కింద లెక్క.. దశాబ్దాల కెరీర్ లో ఎంతోమంది కంత్రీగాళ్ల ఆటకట్టించారు.. వ్యక్తిగత విషయాల జోలికిపోతే అస్సలే ఊరుకోరు.. ఈ భూమ్మీద ఆయనకు అమ్మ కంటే ఇష్టమైన వ్యక్తి మరొకరు లేరు.. ఈ విషయాలన్నీ తెలిసి కూడా జస్టిస్ ఎస్ఏ బోబ్డే కుటుంబంతో ఆటలాడుకుని అడ్డంగా బుక్కయ్యాడో దౌర్భాగ్యుడు..

పరిటాల రవి రక్తపిపాసి - దొంగ చంద్రబాబు అండతో కిరాతకాలు: ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలనంపరిటాల రవి రక్తపిపాసి - దొంగ చంద్రబాబు అండతో కిరాతకాలు: ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలనం

మోసపోయిన బోబ్డే తల్లి

మోసపోయిన బోబ్డే తల్లి

సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సొంతూరు మహారాష్ట్రలోని నాగపూర్ అన్న సంగతి తెలిసిందే. వృత్తిరీత్యా ఆయన ఢిల్లీకే పరిమితమైపోగా, ప్రస్తుతం 90ఏళ్లు దాటిన ఆయన తల్లి ముక్తా అరవింద్ బోబ్డే నాగపూర్ లోనే ఉంటున్నారు. కొన్నేళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ముక్తా దాదాపు మంచానికే పరిమితమైపోయారు. బ్రిటిష్ జమానా, ఆర్ఎస్ఎస్ పుట్టుక నుంచే బోబ్డే కుటుంబానికి నాగ్ పూర్ లో చాలా ప్రాముఖ్యముఖ్యముంది. పెద్ద ఎత్తున ఆస్తులు కూడా ఉన్నాయి. స్థానిక ఆకాశవాణి కేంద్రానికి సమీపంలో జస్టిస్ బాబ్డే తల్లి పేరిట పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. ఆమెకు ఆరోగ్య బాగోకపోవడంతో ఆ ఆస్తులకు కేర్ టేకర్ గా ఓ వ్యక్తిని నియమించారు. ముసలావిడ పరిస్థితి అవకాశంగా తీసుకున్న ఆ వ్యక్తి ఏకంగా రూ.2.5కోట్ల మోసానికి పాల్పడ్డాడు..

10ఏళ్లుగా విశ్వాసంగా నటిస్తూ..

10ఏళ్లుగా విశ్వాసంగా నటిస్తూ..

నాగపూర్ లోని జస్టిస్ బోబ్డే తల్లి ఆస్తులకు తపస్ ఘోష్(49)అనే వ్యక్తి గడిచిన 10ఏళ్లుగా కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. సిటీలోనే ప్రముఖ ఫంక్షన్ హాళ్లలో ఒకటి కావడంతో అదెప్పుడూ బిజీగా ఉండేది. మంచానికే పరిమితమైపోయిన ముక్తాకు తప్పుడు లెక్కలు చెబుతూ, ఏళ్లపాటు గోల్ మాల్ వ్యవహారాలు చేశాడు తపస్. లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

డీసీపీ వినితా ఆధ్వర్యంలో సిట్

డీసీపీ వినితా ఆధ్వర్యంలో సిట్

సీజేఐ జస్టిస్ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకరే మోసం చేశాడన్న కేసును నాగపూర్ పోలీస్ సింగం డీసీపీ వినితా సాహు దర్యాప్తు చేపట్టారు. ఆమె నేతృత్వంలో పోలీసులు, ఆర్థిక నేరాల విభాగం అధికారులు సిట్ గా ఏర్పడి కేసు లోతుపాతుల్ని పరిశీలించారు. గడిచిన కొన్నేళ్లుగా తపస్ ఘోష్ రూ.2.5కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం రాత్రి అతణ్ని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్ కు తరలించారు.

English summary
Chief Justice of India (CJI) Sharad Arvind Bobde's mother was duped to the tune of Rs 2.5 crore allegedly by the caretaker of a family property here, a police official said on Wednesday. The accused, Tapas Ghosh (49), was arrested on Tuesday night and a Special Investigation Team (SIT) of the Nagpur police is looking into the matter under the supervision of DCP Vinita Sahu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X