• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

bengalలో మళ్లీ పేట్రేగిన హింస -బాంబులు విసురుకున్న ఇరు వర్గాలు -హుగ్లీ జిల్లా చందన్‌నగర్‌లో టెన్షన

|

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తారా స్థాయికి వెళ్లి, ఫలితాల అనంతరం కూడా కొనసాగి, కేంద్ర, రాష్ట్రాల వినతుల తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన హింస మళ్లీ పేట్రేగింది. ఈసారి రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల వివరణ ప్రకారం.. హుగ్లీ జిల్లాలోని చందన్ నగర్ లో బుధవారం రాత్రి నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. నగరంలోని లిచూపట్టీలో నివసించే ఓ వర్గం.. ఉర్దూ బజార్ కు చెందిన మరో వర్గం మధ్య తలెత్తిన చిన్న గొడవ కాస్తా అల్లర్లకు దారితీసింది.

షాకింగ్: ప్రభుత్వాలే యూనియన్ పెడితే -కేంద్రంపై పోరుకు రాష్ట్రాల యూనియన్ ప్రతిపాదించిన మమతషాకింగ్: ప్రభుత్వాలే యూనియన్ పెడితే -కేంద్రంపై పోరుకు రాష్ట్రాల యూనియన్ ప్రతిపాదించిన మమత

clash-breaks-out-in-bengal-s-hooghly-groups-hurl-crude-bombs-bricks-at-each-other

చందన్ నగర్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు, ఇటుకలతో దాడులు చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా యుద్ధవాతావరణాన్ని తలపించగా, పోలీసుల రంగప్రవేశం తర్వాత మూకలను చెదరగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం రెండు వర్గాలు పరస్పరం నాటు బాంబులు కూడా విసురుకున్నారు. మొత్తం ఆరు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మూకలు వీధుల్లోకి వచ్చి కనిపించిన వాహనాలను ధ్వసం చేశాయి. అల్లర్ల సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ యంత్రాంగం భారీ ఎత్తున మోహరించింది. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అల్లర్లలో ఇప్పటిదాకా ఎవరికైనా గాయాలైంది లేనిది తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

  PM Modi has 'decided' date of Clash with China, Pak: UP BJP | Oneindia Telugu

  కరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలుకరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలు

  బెంగాల్ ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాతా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హింస, దాడులు, ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షనేత, బీజేపీ ఫ్లోర్ లీడర్ సువేందు అధికారిపై ఏకంగా దొంగతనం కేసు నమోదైంది. మమత సర్కార్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోన్న సువేందు.. బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కాగా, హుగ్లీ అల్లర్లకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

  English summary
  Aclash broke out between two groups at Chandannagar in West Bengal's Hooghly district on Wednesday. Police deployment has been heightened in the area to bring the situation under control. Preliminary inputs indicate that bricks and stones were hurled following a clash between a group of locals from Lichupatty and another from Urdu Bazar in Chandannagar. Members of the groups even hurled at least six crude bombs at each other during the clash.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X