వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ఎన్నికల కమీషన్‌లో విభేదాలు... సమావేశాలకు దూరంగా అశోక్ లవాసా

|
Google Oneindia TeluguNews

ముగ్గురు సభ్యులు గల కేంద్రఎన్నికల సంఘంలో లుకలుకలు బయటపడ్డాయి. తన అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని భావిస్తున్న సభ్యుల్లో ఒకరైన అశోక్ లవాసా ప్రధాని నరేంద్రమోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన విషయంలో తీసుకున్న కమీషన్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఈసీ సమావేశాలకు కూడ హజరుకావడం లేదు. కాగా ఇదే విషయమై రెండురోజుల క్రితం ఎన్నికల ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోడాకు కూడ లేఖ రాశారు.

ఎన్నికల కమీషన్ సభ్యుల్లో విభేదాలు...

ఎన్నికల కమీషన్ సభ్యుల్లో విభేదాలు...

సాధరణ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల కమీషన్ బాధ్యత చాల కీలకమైంది.కాని అదే సమయంలో రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో పాటు వారు ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల కమీషన్‌దే ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్నికల కమీషన్ కొంతమంది రాజకీయ నాయకులకు అనుకూలంగా మరికొంతమందికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలు ,ఆరోపణలు ఎదుర్కోంటుంది. ఎన్నికల కమీషన్ సభ్యుల్లోనే విరుద్ద అభిప్రాయాలు ఎర్పడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఎన్నికల సభ్యుల్లో చీఫ్ ఎన్నికల కమీషనర్‌గా సునిల్ ఆరోరాతోపాటు మరో సభ్యుడు అశోక్ లవాసాతో పాటు సశీల్ చంద్రా సభ్యులుగా ఉన్నారు.

 మోడీ, అమిత్‌షాలకు క్లీన్‌చిట్ ఇవ్బడంలో అభ్యంతరం

మోడీ, అమిత్‌షాలకు క్లీన్‌చిట్ ఇవ్బడంలో అభ్యంతరం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఎయిర్ స్ట్రైక్‌లో భాగంగా భద్రతా దళాలు సాధించిన విజయాన్ని ఎన్నికల్లో ప్రచారం చేయడంపై కాంగ్రేస్ పార్టీ పిర్యాధు చేసింది. దీంతోపాటు ప్రధాని నరేంద్రమోడీ ,రాజీవ్ గాంధీపై అవినీతీ ఆరోపణలు చేశాడు. ఈనేపథ్యంలోనే కాంగ్రేస్ పార్టీ మోడీ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా బాలకోట్ ఉదంతంపై ఏప్రిల్ 21న మోడీ మాట్లాడిన వ్యాఖ్యలను పరీశీలించిన ఈసీ మే4న క్లీన్‌చిట్ ఇచ్చింది.ఇలా ఆరు సంధర్బాల్లో మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో అశోక్ లవాసా దీనిపై అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మిగతా ఇద్దరు సభ్యులు కూడా లవాసా అభిప్రాయాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

 చీఫ్ ఎన్నికల కమీషనర్‌కు లవాసా లేఖ

చీఫ్ ఎన్నికల కమీషనర్‌కు లవాసా లేఖ

కాగా ఇదే విషయాలపై లవాసా చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌కు రెండు రోజుల క్రితం లేఖ కూడ రాశారు. లేఖలో ముఖ్యంగా ఎన్నికల కమీషన్ తీసుకునే నిర్ణయాల్లో బాగంగా మైనారీటి నిర్ణయాలను పరిగణలలోకి తీసుకోవడం లేదని తెలిపారు. మరియు ఆ అభిప్రాయాలను కమీషన్ నిర్ణయాల్లో రికార్డ్ చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.కాగా అప్పటి నుండి ఎన్నికల కమీషన్ తీసుకునే నిర్ణయాల్లో లవాసా పాలుపంచుకోవడం లేదని తెలిపారు.

మైనారీటీ అభిప్రాయాలను రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు

మైనారీటీ అభిప్రాయాలను రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు

అయితే ఎన్నికల కమీషన్ తీసుకునే నిర్ణయాల్లో మైనారీటీ అభిప్రాయాలను రికార్డ్ చేయాల్సిన అవసరం కూడ ఉందని లవాసా చెప్పిన నేపథ్యంలోనే మైనారీటీ అభిప్రాయాలను కేవలం న్యాయపరమైన వివాదాల్లో మాత్రమే నమోదు చేస్తారని ఎన్నికల వివాదాల్లో మైనారీటీ అభిప్రాయాన్ని నమోదు చేయరని తెలిపారు.

English summary
Election Commissioner Ashok Lavasa has stopped attending meetings to decide on violations of the Model Code of Conduct over his "minority decisions going unrecorded", correspondence reviewed by NDTV finds. Some of his objections involve the Election Commission's clean chit to Prime Minister Narendra Modi in six instances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X