వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు, వింటేనే విచిత్రం !

|
Google Oneindia TeluguNews

చండీగడ్: ఒకటో తరగతి కుర్రాడు అత్యాచారయత్నం చేశాడని కేసు నమోదు చేసిన విచిత్రమైన సంఘటన హర్యానాలో జరిగింది. ఒకటో తరగతి బాలిక మీద అత్యాచారయత్నం చేశారని ఆమె తల్లి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని డీఎస్పీ రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!

హర్యానాలోని సిర్సా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక ఒకటో తరగతి చదువుతున్నది. పాఠశాలకు వెళ్లిన బాలిక సోదరుడితో కలిసి ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చిందని ఆమె తల్లి అంటున్నది. తన కుమార్తెను అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని బాలిక తల్లి ఆరోపిస్తున్నది.

Class 1 Student Booked For Rape Attempt case in Haryana

విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అబ్బాయిల ఫోటోలను ఆసుపత్రిలో ఉన్న బాలికకు చూపించామని, బాలిక తెలిపిన వివరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు.

తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !

ఇదే సమయంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లల మీద అత్యాచారయత్నం కేసులు పెట్టడం ఏమిటని, అసలు వాళ్లుకు అలాంటి విషయాల గురించి ఏమి తెలుసని విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. ఒకటో తరగతి బాలుడి మీద అత్యాచారయత్నం కేసు నమోదు చేశారని వెలుగు చూడటంతో అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు.

English summary
Haryana: Class 1 Student Booked For Rape Attempt, A Class 1 boy studying in a government school in Sirsa was booked for attempting to rape his classmate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X