వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్: మ్యాథ్స్ పరీక్షలో సులభమైన పేపర్ ఎంపిక చేసుకోవచ్చన సీబీఎస్ఈ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 2020 నుంచి పదవ తరగతి విద్యార్థులకు రెండు రకాల మ్యాథ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరీక్ష పద్ధతిని మ్యాథ్స్ - స్టాండర్డ్‌గా, మ్యాథమేటిక్స్ -బేసిక్ లెవెల్‌గా నిర్వహించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మాత్రం మార్పులు చేయడం లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. రెండు లెవెల్స్‌లో పరీక్ష నిర్వహించడం వల్ల పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని సీబీఎస్ఈ తెలిపింది.

మ్యాథ్స్ పరీక్ష అంటే విద్యార్థులు చాలామంది భయపడుతున్నారని సీబీఎస్ఈ పేర్కొంది. అంతేకాదు పరీక్ష సమయంలో ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించింది.అంతేకాదు మ్యాథ్స్ అంటే చాలా కష్టమైన సబ్జెక్టుగా పిల్లలు చూస్తున్నారని ముందు ఆ భయం వారిలోనుంచి పారిపోవాలని సీబీఎస్ఈ వెల్లడించింది. 2020 బోర్డు పరీక్షలో ఈ తరహా ప్రయోగాన్ని అమలు చేస్తామని వెల్లడించింది.

Class 10 students can choose ‘easier’ Maths paper from 2020: CBSE

ఇదిలా ఉంటే సిలబస్, క్లాస్ రూం పాఠం, ఇంటర్నల్ టెస్టులు రెండు లెవెల్ పరీక్షలకు ఒకటిగానే ఉంటాయని ఇందులో మార్పు ఉండదని సీబీఎస్ఈ వివరించింది. ఇలా చేయడం వల్ల సబ్జెక్టు మొత్తాన్న చదవుతారని పరీక్షను మాత్రం వారికి నచ్చిన పేపర్ అంటే సులభంగా ఉండే పేపరు లేదా కాస్త కఠినంగా ఉండే పేపరు ఎంచుకుని పరీక్ష రాస్తారని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది.

English summary
The Central Board of Secondary Education (CBSE) will introduce two levels of examination in Mathematics for Class 10 students in 2020 to cater to different kinds of learners.The nomenclature for the two examinations will be Mathematics - Standard, for the existing level of examination, and Mathematics - Basic, for the easier level, according to a circular issued by the CBSE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X