వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెక్కలు చేయడం లేదని బాలుడి గొంతులో కర్ర గుచ్చిన టీచర్: పరిస్థి విషమం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లెక్కలు(గణిత సమస్య) చేయడలేదని కోపంతో ఓ ఉపాధ్యాయుడు రెండో తరగతి బాలుడి నోట్లో కర్ర గుచ్చాడు. దీంతో తీవ్రంగా గాయపడడ్డ బాలుడు మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్లాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్రలోని కర్జత్‌ నగర సమీపంలోని పింపల్‌గావ్‌లో జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల రోహన్‌ అనే బాలుడు గణితం సమస్య చెయ్యలేదనే కోపంతో చంద్రకాంత్ సోపన్‌ షిండే అనే ఉపాధ్యాయుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, కర్రతో చిన్నారి గొంతులో గుచ్చాడని ఆరోపిస్తున్నారు.

Class 2 student fails to solve Maths problem, enraged teacher pierces his throat with wooden cane

కర్ర బాలుడి గొంతులోకి దిగడంతో అన్నవాహిక, శ్వాసనాళం తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కర్ర గొంతులో గుచ్చుకోవడంతో బాలుడు తరగతి గదిలో కింద పడిపోయాడు. రక్తపు మడుగులో మాట్లాడలేని పరిస్థితిలో అచేతనంగా పడి ఉన్న చిన్నారిని చూసి తోటి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. పాఠశాల యాజమాన్యం వెంటనే బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు పుణెలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
The incident took place on Tuesday in the Zilla Parishad School in Pimpalgaon village in Maharashtra's Karjat. Overcome with anger, the teacher took his wooden cane and shoved it into the child's throat, which ended up piercing it, severely damaging both his wind-pipe, which resulted in him becoming speechless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X