వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4వ తరగతి అత్యాచార బాధితులికి వైద్యం నిరాకరించిన ఆస్పత్రి

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అత్యాచార బాధితురాలి ప్రాణాలమిదికి తెచ్చింది. నాలుగు రోజులపాటు వైద్యం నిరాకరించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, చైల్డ్ హెల్ప్ లైన్ టీమ్ జోక్యంతో ఆ 11 బాలికకు షాజహాన్‌పూర్‌ ఆస్పత్రిలోని వైద్యం అందించారు.

జనవరి 7న ఓ రైతు కూతురైన 11ఏళ్ల బాలికపై 20ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆ తర్వాత తీవ్రగాయాలతో పడివున్న ఆమెను కుటుంబసభ్యులు గుర్తించారు. ఆమె మెడపైన గాయాలున్నాయి. అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

Class 4 girl survives rape, strangulation in UP, denied hospital bed for 4 days

జనవరి 8న 4వ తరగతి చదువుతున్న బాలికను జిల్లా ఆస్పత్రికి తరలించాడు ఆమె తండ్రి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను ఇంటికి పంపించేశారు వైద్యులు. తిల్హర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోశన్ లాల్ వర్మ జోక్యంతో నాలుగు రోజుల తర్వాత ఆ బాలికను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.

వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బాధిత బాలిక కోలుకుంటోంది. వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బరేలీలో ఓ మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు యువకులు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని రికార్డు చేశారు.

English summary
Negligence on the part of the district hospital in Uttar Pradesh's Bareilly left an 11-year-old rape survivor to fend for herself. The girl, a student of Class IV, was admitted to a hospital in Shahjahanpur only after intervention by a child helpline team and the local MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X