వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బ్రేకింగ్: ప్రధాని నరేంద్ర మోడీకి గుజరాత్ అల్లర్లలో క్లీన్ చిట్

|
Google Oneindia TeluguNews

2002 గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తన తుది నివేదికను గుజరాత్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది.

ఈ నివేదికను ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హ్‌ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి 2008లో జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తొలి నివేదికలో గోద్రా ఘటనలో రైలు కాలిపోయిన ఘటనను ప్రస్తావించింది.సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి ఎస్-6 కోచ్‌ అల్లర్ల సందర్భంగా గోద్రా రైల్వే స్టేషన్‌లో తగలబెట్టారు.

 Clean chit given to PM Modi in 2002 Gujarat riots

అయితే ఇది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన కుట్ర అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. 2008లో తొలి నివేదికలో కూడా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ఇచ్చిన ఐదేళ్లకు అసెంబ్లీలో గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా ప్రవేశపెట్టారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2014లో గుజరాత్ ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ నానావతి అక్షయ్ మెహతాలు తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అల్లర్లలో దాదాపు 1000 మంది ప్రజలు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అత్యధికులు మైనార్టీ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఈ రిపోర్టును అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందిబెన్ పటేల్‌కు సమర్పించారు.

గుజరాత్ అల్లర్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గుజరాత్ అల్లర్ల సందర్భంగా చెలరేగిన గొడవల కారణంగా గోద్రా రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బోగిలో ఉన్న 59 మంది కరసేవకులు మృతి చెందారు.

English summary
The Nanavati-Mehta Commission on Wednesday gave clean clit to Prime Minister Narendra Modi on 2002 Gujarat riots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X