వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీపురు పట్టిన స్మృతి, హర్‌స్మిరాత్, కేజ్రీ పార్టీ..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ (క్లీన్ ఇండియా) మిషన్‌ను ప్రారంభించనున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా పలువురు కేంద్రమంత్రులు ఇప్పటికే చీపురు చేతబట్టారు. స్వచ్చ భారత్‌లో భాగంగా రానున్న ఐదేళ్లలో ప్రతి ఇంటికి, ప్రతి సమూహానికి టాయిలెట్స్ కట్టించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 24వ తేదీన ప్రధాని మోడీ బెంగళూరులో విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఏడాదికి 100 గంటలు స్వచ్చ భారత్ కోసం కేటాయించాలని సూచించారు. భారత్‌ను క్లీన్ ఇండియాగా చేసేందుకు అందరు సహకరించాలన్నారు. మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019 వరకు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

మోడీ స్వచ్చ భారత్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఈ విషయమై ట్వీట్ చేశారు. మోడీ స్వచ్ఛ భారత్ మిషన్‌ను అక్టోబర్ 2న లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వచ్ఛ భారత్ కోసం కేంద్రమంత్రులు చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చారు.

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ పాఠశాలలో క్లీన్ చేస్తున్న దృశ్యం.

రవిశంకర ప్రసాద్

రవిశంకర ప్రసాద్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సెంట్రల్ కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ రవిశంకర ప్రసాద్ శాస్త్రి భవన్ బయట చీపురుతో శుభ్రం చేస్తున్న దృశ్యం.

ఉమా భారతి

ఉమా భారతి

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్రమంత్రి ఉమాభారతి దేశ రాజధాని న్యూఢిల్లీలోని శ్రమ శక్తి భవన్ వద్ద చీపురుతో శుభ్రం చేస్తున్న దృశ్యం.

రామ్ విలాస్ పాశ్వాన్

రామ్ విలాస్ పాశ్వాన్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎఫ్‌సీఐ భవన్ ముందు క్లీన్ చేస్తున్న దృశ్యం.

 జితేంద్ర సింగ్

జితేంద్ర సింగ్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ భవన్ ముందు చీపురు పట్టి పలువురు శుభ్రం చేస్తున్న దృశ్యం.

హర్‌స్మిరాత్ కౌర్ బాదల్

హర్‌స్మిరాత్ కౌర్ బాదల్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర మంత్రి హర్‌స్మిరాత్ కౌర్ బాదల్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని పంచశీల్ భవన్ ముందు క్లీన్ చేస్తున్న దృశ్యం.

హర్‌స్మిరాత్ కౌర్ బాదల్

హర్‌స్మిరాత్ కౌర్ బాదల్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర మంత్రి హర్‌స్మిరాత్ కౌర్ బాదల్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని పంచశీల్ భవన్ ముందు క్లీన్ చేస్తున్న దృశ్యం.

రైల్వే ఉద్యోగులు

రైల్వే ఉద్యోగులు


స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా గౌహతిలోని రైల్వే ఉద్యోగులు క్లీన్ చేస్తున్న దృశ్యం. మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019 వరకు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

శ్రీపాద్ యశో నాయక్

శ్రీపాద్ యశో నాయక్

స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఎమ్మెస్వో శ్రీపాద్ యశో నాయక్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట ముందు చీపురుతో క్లీన్ చేస్తున్న దృశ్యం.

 కల్రాజ్ మిశ్రా

కల్రాజ్ మిశ్రా

స్వచ్ఛ భారత్ మిషన్‌లో కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా దేశ రాజధాని న్యూఢిల్లీలోని కార్యాలయంలో గల ఓ ఫ్లోర్‌ను చీపురుతో శుభ్రం చేస్తున్న దృశ్యం.

ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ

మోడీ స్వచ్చ భారత్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఈ విషయమై ట్వీట్ చేశారు.

English summary
New Delhi, Oct 1: As the "Swacch Bharat" (Clean India) Mission would be launched Oct 2, 2014, lets have a look at what initiatives have been taken in the past one month to fulfill the pet project of PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X