వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి జై కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్: ఒక్క రోజు గ్యాప్, కమల్ హాసన్ కు ఝలక్ !

రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అని అయోమయంలో కొంత కాలంగా మౌనంగా ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి జై అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అని అయోమయంలో కొంత కాలంగా మౌనంగా ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి జై అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ కు రజనీకాంత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

తమిళనాడు ప్రజలు నన్ను సీఎం చేస్తారు, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: కమల్ హాసన్!తమిళనాడు ప్రజలు నన్ను సీఎం చేస్తారు, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: కమల్ హాసన్!

భారతప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ అనే సేవా కార్యక్రమానికి మాత్రమే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు ప్రకటించలేదని, దాని వెనుక మరి కొన్ని కారణాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Cleanliness is godliness Rajinikanth post twitter page

శుక్రవారం రజనీకాంత్ తన ట్వీట్టర్ పేజ్ లో ఓ పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీగారు చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దేశ శుభ్రతే దైవ భక్తి అంటూ ట్వీట్ చేశారు. తన అభిమానులు స్వచ్చతాహీ సేవా మిషన్ లో పాల్గొనాలని రజనీకాంత్ తన అభిమాన సంఘాలకు పిలుపునిచ్చారు.

కమల్ హాసన్, కేజ్రీవాల్ మీటింగ్: ట్రంప్ తో భేటీ అయినా మాకు నష్టం లేదు: మంత్రి, తిరగలేవు !కమల్ హాసన్, కేజ్రీవాల్ మీటింగ్: ట్రంప్ తో భేటీ అయినా మాకు నష్టం లేదు: మంత్రి, తిరగలేవు !

గురువారం తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ అవినీతికి, మతోన్మాధ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని గట్టిగా చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కమల్ హాసన్ భేటీ అవుతున్నారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన సమయంలో తాను కాషాయ రంగు పార్టీ వాడిని కాదని కమల్ హాసన్ చెప్పారు. మోడీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కమల్ హాసన్ కలిసిన మరుసటి రోజే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని మోడీకి మద్దతు తెలిపి కమల్ హాసన్ కు పరోక్షంగా ఝలక్ ఇచ్చారు.

English summary
Rajinikanth has posted his twitter page, I extend my full support to our hon. Prime Minister Narendramodi ji’s SwachhataHiSeva mission. Cleanliness is godliness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X