ట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు
ఇండియా అంటే తనకెంతో ఇష్టమని, ప్రధాని నరేంద్ర మోదీ ఆప్తమిత్రుడంటూ అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. సీన్ కట్ చేస్తే, నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇదే ఇండియాను ఉద్దేశించి ట్రంప్ అవమానకరంగా మాట్లాడటం, ఇండియాలో గాలి నాణ్యత దారుణంగా(ఫిల్తీ ఎయిర్) ఉందని, వాతావరణ కాలుష్య కట్టడికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తిట్టిపోయడం కూడా మనం మర్చిపోలేం. ఇంకో నెల రోజుల్లో ట్రంప్ గద్దె దిగబోతుండగా సదరు వ్యాఖ్యలకు కౌంటర్ గా మోదీ సర్కార్ ఆఖరి పంచ్ విసిరిందిలా..
జగన్‌కు మళ్లీ షాక్ -ఓటరు జాబితాపై నిమ్మగడ్డ ఆదేశాలు -ఫిబ్రవరిలోనే పోల్స్ -సీఎస్‌కు మరో లేఖ

పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు..
విచ్చల విడిగా ఇధనాల వినియోగం, అంతులేని పారిశ్రామికీకరణతో గ్రీన్ హౌజ్ వాయువులు వెల్లువలా పెరుగుతూ భూగోళం వేడెక్కి కొత్త రకం విపత్తులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యంతో 195 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందానికి అంగీకరించి శనివారానికి(డిసెంబర్ 12) ఐదేళ్లు పూర్తవుతుంది. క్లైమెట్ ఛేంజ్ కట్టడిలో కీలక పాత్ర పోషించాల్సిన అమెరికా ట్రంప్ తెంపరి నిర్ణయాల కారణంగా పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగింది. ఇండియా, చైనా, రష్యా లాంటి దేశాలు విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతుంటే, దాన్ని నివారించడానికి మేం డబ్బులు ఖర్చుపెట్టాలా? అని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఎన్నికల సమయంలో మరో అడుగు ముందుకేసి, ఇండియాలో గాలి నాణ్యత దారుణంగా ఉంటుందని విమర్శించాడు. పారిస్ ఒప్పందం ఐదో వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం చేసిన ప్రకటనలో ట్రంప్ కు కౌంటర్లు పడ్డాయి..
కార్పొరేట్లకు బలైపోతాం.. కాపాడండి -సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతులు -బీజేపీ భారీ ఎదురుదాడి

ఆ పాపం ఇండియాది కాదు..
పారిస్ ఒప్పందం ఐదో వార్షికోత్సవం సందర్భంగా భారత పర్యావరణ శాఖ మంత్రి ప్రకావ్ జవదేకర్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పర్యావరణ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని, హానికర ఉద్గారాల కారణంగా గత 100 ఏండ్లుగా మార్పులు జరుగుతూ వచ్చాయని, పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఉద్గారాల విడుదలలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే ముందు వరుసలో ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికా అత్యధికంగా 25 శాతం ఉద్గారాలను పర్యావరణంలోకి వదులుతున్నదని గుర్తు చేసిన జవదేకర్ పరోక్షంగా ట్రంప్ ఆరోపణలను ఖండించారు. అమెరికా తర్వాత యూరప్ 22 శాతం, చైనా 13 శాతం ఉద్గారాలను వదులుతున్నాయని చెప్పారు. కర్బన ఉద్గారాల్లో భారత్ వాటా కేవలం 3 శాతం మాత్రమేనని, పర్యావరణ మార్పుల పాపం భారత్ ఒక్కదానిదే కాదని జవదేకర్ పేర్కొన్నారు. అయితే..

బాధ్యత ఉంది కాబట్టే..
తప్పు ఎటు వైపు నుంచి జరుగుతున్నప్పటికీ ముప్పు ప్రపంచదేశాలన్నిటికీ ఉంది కాబట్టి, ప్రపంచ వ్యవహారాల్లో ఒక బాధ్యతగల భాగస్వామిగా భారత్ పర్యావరణ మార్పులపై పోరాటంలో పాలుపంచుకుంటోందని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం భారత ఉద్గారాల్లో 33 నుంచి 35 శాతం వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుతం ఆ లక్ష్యంలో 21 శాతం పూర్తిచేశామని, రాబోయే పదేండ్లలో పూర్తి లక్ష్యం నెరవేరనుందని జవదేకర్ స్పష్టం చేశారు. ట్రంప్ హయాంలో పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా.. ఇప్పుడు జోబైడెన్ కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో మళ్లీ ఒప్పందంలో చేరబోతున్నది. జనవరి 20న పగ్గాలు చేపట్టనున్న బైడెన్ తొలి సంతకం పారిస్ ఒప్పందంలో రీజాయినింగ్ పైనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.