వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫార్మా కంపెనీల దారుణం?: మనుషులపై క్లినికల్ ట్రయల్స్..

|
Google Oneindia TeluguNews

జైపూర్: క్లినికల్ ట్రయల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. జంతువులపై చేయాల్సిన క్లినికల్ ట్రయల్స్ ని కొన్ని ఫార్మా సంస్థలు నేరుగా మనుషులపై ప్రయోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా జరగుతున్న ఈ వ్యవహారం తాజాగా రాజస్థాన్‌లో వెలుగుచూసింది.

పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొంతమందికి కూలీలకు వలవేసిన ఫార్మా సంస్థలు వారిపై ఔషధ ప్రయోగాలు చేశాయి. దీంతో బాధితులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రోజుకు రూ.500 చొప్పున ఇస్తామని చెప్పి బాధితులపై ఈ ప్రయోగాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితులంతా ప్రస్తుతం చురు జిల్లా కేంద్రంలోని జల్పాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

clinical drug trials on humans in rajasthan

ఈ వ్యవహారంపై ఓ బాధిత యువకుడు స్పందించాడు. ఏప్రిల్ 18న తమను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పాడు. డబ్బులు ఆశచూపడంతోనే వచ్చామని, కానీ ఇక్కడికొచ్చాక.. మొత్తం 21 మందిలో 16 మంది అనారోగ్యానికి గురయ్యామని తెలిపాడు. తమపై ఏవో ఔషధాలు ప్రయోగించారని, దాంతో తాము నిద్రలోకి జారుకున్నామని అన్నారు.

ఈ ఘటనపై రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి కాళీ చరణ్‌ సరఫ్‌ స్పందించారు. దీనిపౌ పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.

English summary
A Rajasthan based company that conducts clinical trial of drugs on humans on behalf of global pharmaceutical and biotechnology companies, is in a spot following the death of a volunteer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X