వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు నాటి పరిస్థితి..: సీఏఏ, ఎన్ఆర్సీపై సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే.. ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం విడుదలవుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది.

హేమంత్ సోరెన్ ఎలా గెలిచాడో తెలుసా? రెండో సారి సీఎం కాబోతున్నఈ యువనేత గురించి ఆసక్తికరమైన విషయాలెన్నోహేమంత్ సోరెన్ ఎలా గెలిచాడో తెలుసా? రెండో సారి సీఎం కాబోతున్నఈ యువనేత గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో

సీఏఏ, ఎన్ఆర్సీలపై హేమంత్ సోరెన్ తొలిసారి

సీఏఏ, ఎన్ఆర్సీలపై హేమంత్ సోరెన్ తొలిసారి

ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేఎంఎం కూటమి.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్ అని ప్రకటించాయి. ఈ క్రమంలో తొలిసారి హేమంత్ సోరెన్ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తొలిసారి తన గళం వినిపించారు. సీఏఏ, ఎన్ఆర్సీలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, నోట్ల రద్దు అంశంపైనా కేంద్రాన్ని విమర్శించారు.

అలాంటివారు వద్ద పత్రాలు ఉంటాయా?

అలాంటివారు వద్ద పత్రాలు ఉంటాయా?

దమ్కా, బెర్హేత్ రెండు నియోజకవర్గాల నుంచి సోరెన్ విజయం సాధించే దిశగా సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తాము భారతీయులమని నిరూపించుకోవడానికి క్యూలో నిల్చోవాలా? అని ప్రశ్నించారు. దేశంలో 18 కోట్ల మంది కార్మికులు, ఇళ్లు లేనివారు కూడా ఉన్నారని.. వారంతా చట్టబద్ధమైన పత్రాలు ఎలా చూపగలరని నిలదీశారు. రోజూ కూలీ చేసుకునే ప్రజలు ఆ పత్రాల కోసం ఎటు తిరుగుతారని బీజేపీని ప్రశ్నించారు.

మరోసారి నోట్ల రద్దు పరిస్థితి..

మరోసారి నోట్ల రద్దు పరిస్థితి..

నోట్ల రద్దు తర్వాత ఎలాగైతే ప్రజలు క్యూలలో నిల్చున్నారో.. ఇప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని ఆయన హేమంత్ సోరెన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రం బీజేపీ మాట్లాడటం లేదని అన్నారు.

జార్ఖండ్ ప్రజలు మాత్రం..

జార్ఖండ్ ప్రజలు మాత్రం..


ప్రజల దేశ ఆర్థిక పరిస్థితి గురించి బీజేపీ ఎందుకు చెప్పడం లేదని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. నిరసన చేస్తున్నవారిని తీవ్రంగా అణిచివేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి మంచి చేయాలనే ఉద్దేశమే ఉంటే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఇంతమంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని నిలదీశారు. ఎన్ఆర్సీ, మందిర్-మసీద్ అంశాలతో బీజేపీ ప్రజల్లోకి వెళుతోందని, తమ రాష్ట్రాన్ని కూడా ప్రభావితం చేయాలని చూసిందన్నారు. జార్ఖండ్ ప్రజలు మాత్రం అభివృద్ధికే ఓటు వేశారని సోరెన్ వ్యాఖ్యానించారు.

English summary
Hemant Soren, the Chief Ministerial candidate of the opposition alliance in Jharkhand, reacting to the BJP's dismal performance in the assembly election slams the BJP over issues such as the demonetisation and the CAA-NRC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X