వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: జల్లికట్టుకు తమిళులే బ్రేక్ వేశారు, పన్నీరుకు షాక్.. బలవంతంగా వెనక్కి

జల్లికట్టు తమ సంప్రదాయ క్రీడ అని, ఆర్డినెన్స్‌తో కేవలం ఈ ఏడాదికి మాత్రమే సరిపుచ్చడం సరికాదని, ఎల్లకాలం తమకు అడ్డు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తమిళులు ఆందోళనలు కొనసాగుతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మళ్లీ బ్రేక్ పడింది. మూడేళ్ల తర్వాత.. ఆర్డినెన్స్ తేవడం ద్వారా ఈ ఏడాది జల్లికట్టు అంగరంగ వైభవంగా జరగాల్సి ఉంది. అయితే, ఈసారి తమిళుల వల్లే జల్లికట్టుకు బ్రేక్ పడింది.

ఆర్డినెన్స్‌కు ఆమోదం, 'మెరీనా'లో పర్మెనెంట్ కోసం పట్టుఆర్డినెన్స్‌కు ఆమోదం, 'మెరీనా'లో పర్మెనెంట్ కోసం పట్టు

జల్లికట్టు తమ సంప్రదాయ క్రీడ అని, ఆర్డినెన్స్‌తో కేవలం ఈ ఏడాదికి మాత్రమే సరిపుచ్చడం సరికాదని, ఎల్లకాలం తమకు అడ్డు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తమిళులు ఆందోళనలు కొనసాగుతున్నారు.

O Panneerselvam

మధురైలోని అలంగనల్లూరులో ఈ రోజు (ఆదివారం) ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం జల్లికట్టును ప్రారంభించాల్సి ఉంది. కానీ నిరసనకారుల దెబ్బకు ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. మధురైలో జల్లికట్టును ప్రారంభించాలన్న ప్రతిపాదనను పన్నీరు రద్దు చేసుకున్నారు.

జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఉద్యమిస్తుండటంతో అలంగానల్లూరు వెళ్లే ప్రతిపాదనను రద్దు చేసుకున్నారు. అయితే పన్నీరు సెల్వం.. దిండిగల్లులో జల్లికట్టను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధురైలో నిరసన నేపథ్యంలో ఇప్పటికే వెనక్కి బయలుదేరి చెన్నై వెళ్తున్న పన్నీరు.. అటు నుంచి దిండిగల్ వెళ్తారు.

నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ ఈ ఏడాది మాత్రమే అనుమతించనుండటంతో స్థానికులు శాశ్వత పరిష్కారానికి పట్టుబడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో కేవియట్‌ కూడా దాఖలు చేసింది. దీనిపై తొలుత సుప్రీం కోర్టు తన అభిప్రాయం చెబుతుంది. నేటి జల్లికట్టుకు అల్లంగానల్లూరు వద్ద ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించగానే స్థానిక గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రహదారులను దిగ్బంధం చేశారు. జల్లికట్టు ప్రాంగణానికి తరలించాలని ప్రభుత్వం సిద్ధం చేసిన అంబులెన్స్‌లు అన్ని అక్కడే చిక్కుకుపోయాయి.

English summary
CM O Panneerselvam may return to Chenna, say sources as the people in Alanganallur are still defiant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X