వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి బస్సు యాత్రను అడ్డుకున్న ప్రజలు...20 ని''పాటు నిరసన..!

|
Google Oneindia TeluguNews

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామీ చేపట్టిన బస్సు యాత్రకు నిరసన సెగ తగిలింది... బస్సు యాత్ర చేపట్టిన తర్వాత రెండవ గ్రామంలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి పలువురు స్థానికులు తమ సమస్యలపై నిరసన గళం విప్పారు. రాయచూర్‌కు చేరుకున్నా ఆయన కాన్వాయ్‌ని తుంగభద్ర కెనాల్ పనిచేస్తున్నే కార్మీకులు అడ్డుకున్నారు..కార్మీకులకు 14 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు ముఖ్యమంత్రి వెళుతున్న కాన్వాయ్‌లోని బస్సు ముందు బైఠాయించారు..సుమారు 20 నిమిషాల పాటు ఆందోళన చేశారు..దీంతో వారితో ముఖ్యమంత్రి కుమారస్వామీ వాదనలు చేశారు...

కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామీ బస్సు యాత్ర చేపట్టారు.. ప్రభుత్వ బస్సులోనే ఆయన యాత్రను కొనసాగిస్తున్నారు..దీంతో ఆయన నేడు రాంచీలోని మాన్వీ తాలుకాలోని కర్రెగుడ్డా గ్రామంలో నిద్రించిన కుమారస్వామీ తిరిగి యాత్రను చేపట్టే క్రమంలో స్థానికంగా ఉన్న తుంగభద్ర రివర్ బోర్డులో తాత్కలిక ఉద్యోగాలు చేస్తున్న సుమారు 750 మంది తమకు 14 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ముఖ్యమంత్రికి విన్నవించారు..దీంతో పాటు ఉద్యోగ భద్రత లేదంటూ వారు తెలిపారు..అయితే వారి సమస్యలపై ముందుగానే వచ్చి మాట్లాడతానని చెప్పిన వారు మాత్రం వెనక్కి తగ్గలేదు..

 CM HD Kumaraswamy bus journey was not pleasant

దీంతో కుమార స్వామీ ఓకింత అసహనానికి గురయ్యారు. మీడియా ముందు అతిగా ప్రవర్తించవద్దంటూ హెచ్చరించారు..దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈనేపథ్యంలోనే బస్సులో నుండే వారి సమస్యకు వారంలోగా పరిష్కారం చూపుతానని, దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ అనంతరం ఆందోళనకారులు సీఎం కాన్వాయ్‌కి దారి ఇచ్చారు..కాగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చేపట్టిన బస్సు యాత్రలో నిరసనలు కొనసాగుతుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు..కాన్వాయ్‌కి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

English summary
When Chief Minister HD Kumaraswamy left for his second village stay in Karegudda, Manvi Taluk in a government bus on Wednesday, his journey was not pleasant,as his vehicle was stopped just outside the inspection bungalow in Yermarus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X