వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఫోన్ ట్యాపింగ్..! అధారాలు ఉన్నాయన్న నేత

|
Google Oneindia TeluguNews

ఫోన్ ట్యాపింగ్‌లపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఫోన్ సైతం టాపింగ్‌కు గురైందని ఆమే ఆరోపణలు చేశారు. ట్యాపింగ్‌కు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయం కేంద్రానికి కూడ తెలుసని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్ర ఏజెన్సీలతో పాటు మరో రెండు మూడు రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. అందులో ఒక బీజేపీ పాలిత రాష్ట్రం కూడ ఉందని మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు.

రెండు రోజుల క్రితం భారతీయ జర్నలిస్టులు ,మానవ హక్కుల సంఘాల నేతలకు సంబంధించిన వాట్సప్ అకౌంట్లను ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ హ్యాక్ చేశారని. సుమారు 1400 మందికి చెందిన డాటా వాట్సప్ ద్వార హ్యాక్ చేసినట్టు వాట్సప్ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈనేపథ్యంలోనే సమాచార వ్యవస్థపై కేంద్రం తీసుకుంటున్న భద్రత చర్యలు అందోళన కల్గిస్తున్నాయని అన్నారు.. ప్రస్తుత భద్రత చర్యల వల్ల కనీసం ల్యాండ్ ఫోన్ కూడ వాడే పరిస్థితి లేదని ఆమే తెలిపారు. ఇది మానవుల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కల్గించడమేనని అన్నారు.

cm mamata Banerjee phone tapping

ఫోన్ ట్యాపింగ్‌ల వ్వవహారం చాల తీవ్రంగా పరిగణించాల్సిన వ్యవహారం అని, దీనిపై ప్రధానమంత్రి మోడీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కనీసం ఫోన్లో మాట్లాడలేకపోయిన మనకు ఇంకా స్వాతంత్య్రం ఎందుకు వచ్చినట్టు ఆమె ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే తనఫోన్ కూడ ఎన్నోసార్లు ట్యాపింగ్‌కు గురయిందని ,ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

English summary
''My phone is tapped, I know that because I have got the information and have the evidence with me'' cm mamata Banerjee said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X