వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి, జ్యుడీషియల్ విచారణ, వీడియోలు ఇస్తాం, మన్నార్ గుడి ఫ్యామిలీ, పన్నీర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని శశికళ నటరాజన్ సోదరుడు దివాకరన్ కుమారుడు జయంత్ అన్నాడు. అమ్మ మరణంలో ఎలాంటి అనుమానాలు వద్దని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకు చెప్పాడు.

మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు, సీఎం మీద బాంబు వేసిన తమిళనాడు మంత్రి!మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు, సీఎం మీద బాంబు వేసిన తమిళనాడు మంత్రి!

జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఆదేశిస్తే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం విచారణ ఎదుర్కోవలసి వస్తుందని జయంత్ అన్నాడు. అందుకు పన్నీర్ సెల్వం సిద్దంగా ఉన్నారా ? అంటూ జయంత్ ప్రశ్నించారు.

CM Palanisamy could order judicial inquiry into Jayalalithaa death says Jayananth

జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే సరైన సాక్షాదారాలు ఇవ్వడానికి శశికళ కుటుంబ సభ్యులు సిద్దంగా ఉన్నారని జయంత్ చెప్పాడు. జయలలితకు చికిత్స చేసే సమయంలో వందకు వంద శాతం వీడియోలు తీశామని జయంత్ వివరించాడు.

జైల్లో శశికళకు మళ్లీ వీవీఐపీ సేవలు, ఆర్ టీఐ అర్జీతో వెలుగులోకి, సుప్రీం కోర్టులో, సిస్టర్!జైల్లో శశికళకు మళ్లీ వీవీఐపీ సేవలు, ఆర్ టీఐ అర్జీతో వెలుగులోకి, సుప్రీం కోర్టులో, సిస్టర్!

జ్యుడీషియల్ విచారణ జరిగితే మా దగ్గర ఉన్న వీడియోలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని జయంత్ అన్నాడు. మదురై జిల్లాలో జరిగిన టీటీవీ దినకరన్ బహిరంగ సభ విజయవంతం కావడంతో శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. అన్నాడీఎంకే పార్టీకి మేమే నిజమైన వారసులు అంటు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు.

English summary
Jayananth says that if Judicial inquiry on Jayalalitha's death will be conducted, OPS has to be enquire. Jayananth, said that the Chief Minister Edappadi Palanisamy could order a judicial inquiry into Jayalalithaa's death and he has 100 percent video evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X