CM Punch: మాజీ ఎమ్మెల్యేలు, పెన్షన్లలో ఊచకోత కోసిన సీఎం, రూ. లక్షల్లో తీసుకుని జల్సాలు, కోట్లలో బొక్క!
అమృత్ సర్/ పంజాబ్: పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పలు మార్పులు చెయ్యాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నిర్ణయించారు. ఇప్పటికే అవినీతికి చోటు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఇప్పుడు పంజాబ్ మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ ల విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే అయిన వాళ్లు జీవితాంతం పెన్షన్లు తీసుకుంటున్నారు.
రెండు మూడుసార్లు మాజీలు అయిన మాజీ ఎమ్మెల్యేలు రెండు మూడు పెన్షన్ లు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అంటున్నారు. ఇక ముందు మాజీ ఎమ్మెల్యేలకు ఒక్క పెన్షన్ మాత్రమే వస్తుందని, రెండు మూడు పెన్షన్లు తీసుకోవాలంటే కుదరదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
నాలుగుసార్లు, ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు నాలుగైదు పెన్షన్లు తీసుకుంటున్నారని ,ఇలా పంజాబ్ ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వస్తోందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్లారిటీ ఇచ్చారు. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ ల మీద వేటు వెయ్యడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది.
Lady
teacher:
అబ్బాయిని
లేపుకుపోయి
గుడిలో
పెళ్లి,
ఎంఫీల్
మేడమ్
కు
జైల్లో
చిప్పకూడు,
కన్నింగ్
లేడి!

కాంగ్రెస్ లో కుమ్ములాట..... క్లైమాక్స్ లో చావు దెబ్బ
పంజాబ్ లో గత నెల వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంటికి వెళ్లిపోయింది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ చావుదెబ్బ తినింది. ఎవ్వరూ ఊహించని విదంగా ఆప్ ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో ఆ రాష్ట్రంలో అమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఆప్ సంచలన నిర్ణయాలు
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత అక్కడి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు చేసే పనులు చెయ్యడానికి మా ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని, రాజకీయ నాయకుల కోసం మా పార్టీ పని చెయ్యదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.

అవినీతికి ఆమడ దూరం
పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పలు మార్పులు చెయ్యాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నిర్ణయించారు. ఇప్పటికే అవినీతికి చోటు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.

మాజీ ఎమ్మెల్యేలకు సినిమా
పంజాబ్ మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ ల విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే అయిన వాళ్లు జీవితాంతం పెన్షన్లు తీసుకుంటున్నారు. రెండు మూడుసార్లు మాజీలు అయిన మాజీ ఎమ్మెల్యేలు రెండు మూడు పెన్షన్ లు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అంటున్నారు.

రూ. లక్షల్లో పెన్షన్లు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు
ఇక ముందు మాజీ ఎమ్మెల్యేలకు ఒక్క పెన్షన్ మాత్రమే వస్తుందని, రెండు మూడు పెన్షన్లు తీసుకోవాంటే కుదరదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. నాలుగుసార్లు, ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు నాలుగైదు పెన్షన్లు తీసుకుంటున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రూ. 75,000 పెన్షన్ తీసుకునే అవకావం ఉందని, నాలుగు ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మాజీలు అయిన వాళ్లు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెన్షన్ తీసుకుంటున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.

ప్రభుత్వానికి రూ. 80 కోట్లు మిగులుతుంది
ఇలా పంజాబ్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల నష్టం వస్తోందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని, మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ లలో కోత విదించడంతో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ. 80 కోట్లకు పైగా మిగులుతుందని, ఆ డబ్బు ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అంటున్నారు. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ ల మీద వేటు వెయ్యడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిరోమణి అకాలిధళ్ స్వాగతించింది.