వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM Seat: ఆ ఇద్దరు డిసైడ్ చేస్తారు, బీజేపీ చీఫ్, రాజ్ భవన్ వైపు అందరిచూపు, ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్, రెబల్స్!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గోవా: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఇప్పుడు బంతి గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ ఏం చెబుతారా ? అని మరాఠీలు వేచి చూస్తున్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కువగా మాట్లాడటం లేదు. కార్యకర్తలు కొంచెం సైలెంట్ గా ఉండాలని, సంబరాలు చేసుకునే టైమ్ దగ్గరపడిందని అంటున్నారు.

మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలని, వారిద్దరే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అంటున్నారు.

Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు!Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు!

రాజ్ భవన్ వైపు అందరిచూపు

రాజ్ భవన్ వైపు అందరిచూపు

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఇప్పుడు బంతి మహారాష్ట్ర గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ ఏం చెబుతారా ? అని మరాఠీలు వేచి చూస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు రాజ్ భవన్ వైపు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇద్దరు నాయకులు డిసైడ్ చేస్తారు

ఇద్దరు నాయకులు డిసైడ్ చేస్తారు

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఆ ఇద్దరు నాయకులు డిసైడ్ చేస్తారని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

ఏ నిర్ణయం అయినా దేవేంద్ర, షిండే తీసుకుంటారు

ఏ నిర్ణయం అయినా దేవేంద్ర, షిండే తీసుకుంటారు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలని, వారిద్దరే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో, మంత్రి పదవుల విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ సీఎం ఠాక్రే వర్గీయులు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ సీఎం ఠాక్రే వర్గీయులు

శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో శివసేన పార్టీలోని ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చెయ్యాలని అంటూ మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

English summary
CM Seat: Devendra Fadnavis and Eknath Shinde will decide next course of action, says Maharashtra BP Chief in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X