
CM Seat: అధికారం ముఖ్యం కాదు, ప్రజల మనుసు గెలుచుకోవాలి, గేర్ మార్చిన బీజేపీ, సీన్ మొత్తం రివర్స్!
ముంబాయి/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రంగం సిద్దం చేసుకున్నా చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తోందని అందరూ అనుకున్నా బీజేపీ అధిష్టాం వ్యూహం మార్చింది. శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేని సీఎం చేస్తున్న బీజేపీ నాయకులు మహారాష్ట ప్రజల మనుసు గెలుచుకోవాలని నిర్ణయించింది. ఏక్ నాథ్ షిండే వెంట శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది మాత్రం ఉన్నారు.
ఇతర స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కలుపుకుంటే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు షిండేకి మద్దతు ఇస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి బలనిరూపణ చేసుకోవడానికి సిద్దంగా ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గిరీష్ మహాజన్ ప్రకటించారు. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు అయ్యే సంకీర్ణ ప్రభుత్వానికి ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అనే విషయాన్ని గురువారం ముంబాయిలో గరీష్ మహాజన్ మీడియాకు చెప్పారు.
Illegal
affair:
ప్రియుడితో
లేచిపోయిన
నలుగురు
పిల్లల
తల్లి,
భార్య
మీద
పగతో
?,
శవాలు
పెట్టుకుని
భర్త!

ఉద్దవ్ రాజీనామా తరువాత ముంబాయికి షిండే
శివసేన మీద తిరుగుబాటు చేసిన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే గుజరాత్ లోని సూరత్, అక్కడి నుంచి అసోంలోని గుహవాటి చేరుకున్నారు. గుహవాటి స్టార్ హోటల్ ఖాళీ చేసిన ఏక్ నాథ్ షిండే గోవాకు వెళ్లిపోయారు. బుధవారం రాత్రి మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన తరువాత గురువారం ఏక్ నాథ్ షిండే ముంబాయిలో అడుగుపెట్టారు.

సీన్ మొత్తం మార్చేసిన దేవేంద్ర ఫడ్నవిస్
ముంబాయిలో మహారాష్ట్ర మాజీ సీఎం, దేవేంద్ర ఫడ్నవిస్ చర్చలు జరిపి తరువాత గవర్నర్ ను కలిశారు. ఏక్ నాథ్ షిండే వర్గంలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, బీజేపీలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలని అనే విషయంలో గవర్నర్ ను కలవకముందే ఇద్దరూ చర్చించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏక్ నాథ్ షిండేకి బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది.

షిండేని రంగంలోకి దింపిన బీజేపీ
శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేతో సహ ఆయన వెంట ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది, ఇతర స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 50 మంది ఉన్నారు. ఏక్ నాథ్ షిండేకి మా మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ నేత ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మేము బలనిరూపణ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గిరీష్ మహాజన్ ప్రకటించారు.

170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది
మహారాష్ట్రలో మరోసారి ఏక్ నాధ్ షిండేకి మద్దతు ఇచ్చి మేము అధికారంలో భాగస్వామి అవుతామని, మా సంకీర్ణ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు గిరీష్ మహాజన్ ప్రకటించారు. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు అయ్యే శివసేన రెబల్- బీజేపీ ప్రభుత్వానికి ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అనే విషయంలో గిరీష్ మహాజన్ క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్రలో ప్రభుత్వం చేపట్టడానికి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని, అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇస్తున్నారని గిరీష్ మహాజన్ తెలిపారు.