India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM seat: సీఎం సీటు హుష్ కాకి, పరువు పోకూడదని ఈనిర్ణయం, బలపరీక్షకు బ్రేక్ ?, ఏక్ నాథ్ వర్గంలో పండగ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గుహవాటి: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంక్షోభం అంచుల వరకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగింది. రేపు జరగబోయే పరిస్థితి ఊహించి ముందుగానే పరువు కాపాడుకోవడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారని ప్రతిపక్షాలు, కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నాయి.

Rebel: సీఎంకు సినిమా చూపించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఓటింగ్, గ్రేట్ ఎస్కేప్ !Rebel: సీఎంకు సినిమా చూపించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఓటింగ్, గ్రేట్ ఎస్కేప్ !

మహారాష్ట్రంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ? అనే విషయంలో ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ లేకపోయినా ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోవడంతో విధిలేని పరిస్థితిలో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చేశారని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.

CM seat: Maharashtra Chief Minister Uddhav Thackeray resigns ahead of No Trust vote tomorrow in the Maharashtra Assembly.

రెబల్ ఎమ్మెల్యేలను ముంబాయి పిలిపించుకోవడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన మద్దతుదారులు అనేక ప్రయత్నాలు చేశారు. గవర్నర్, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉద్దవ్ ఠాక్రేకి వేరే మార్గం లేక సీఎ: పదవికి రాజీనామా చేశారని, రేపు అసెంబ్లీలో పరువు పోకముందే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఓ నాయకుడు అన్నారు.

Wife: మూడు నెలల క్రితం లవ్ మ్యారేజ్, బెడ్ రూమ్ లో భార్య ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన భర్త!Wife: మూడు నెలల క్రితం లవ్ మ్యారేజ్, బెడ్ రూమ్ లో భార్య ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన భర్త!

మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోకుండా ఉండటానికి ఉద్దవ్ ఠాక్రే అనేక చర్యలు తీసుకున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆయన బలపరీక్షకు ఒక్కరోజు ముందుగానే ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు పండుగ చేసుకుంటున్నారని తెలిసింది.

English summary
CM seat: Maharashtra Chief Minister Uddhav Thackeray resigned today after the Supreme Court allowed a no-trust vote. The no trust vote will be held tomorrow in the Maharashtra Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X