వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: ఉద్దవ్ రాజీనామా..? రెండుసార్లు చేస్తాననగా.. ఆపిన శరద్ పవార్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ట్విస్ట్‌లు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్దవ్ వర్సెస్ షిండే మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే తన పదవీకి రాజీనామా చేస్తానని తెలిపారట. రెండుసార్లు రిజైన్ చేస్తానని చెప్పగా.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆపారని విశ్వసనీయ సమాచారం.

సోమవారం సాయంత్రం ఉద్దవ్ థాకరే తన నిర్ణయం వెలువరించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సాయంత్రం 5 గంటలకు రాజీనామా చేశారని తెలిపింది. కానీ శరద్ పవార్ నచ్చబెప్పారని వివరించారు. రెండుసార్లు రాజీనామా చేస్తానని చెప్పగా.. పవార్ ఒప్పించారని సమాచారం.

CM Uddhav Thackeray tried to resign twice

పదవీకి రాజీనామా చేస్తానని గతవారం ఉద్దవ్ థాకరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కోరితే తప్పకుండా చేస్తానని.. చెప్పారు. అంతేకాదు శివసేన చీఫ్ పదవీ నుంచి కూడా వైదొలుగుతానని చెప్పారు. శివ సైనికులు ఆ మాట చెప్పాలని కోరారు. తన వద్దకు వచ్చి చెప్పాలని కోరారు.

అంతకుముందు వర్షను వదిలి వెళుతున్నందుకు బాధపడటం లేదని సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. ఇదీ తనది కాదని తనకు తెలుసు అని చెప్పారు. ఇదివరకు చాలా మంది కూడా అలాగే వెళ్లారని గుర్తుచేశారు. తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. తనతో శివ సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలకు శివ సైనికుల నుంచి థ్రెట్ ఉంది. ఇప్పటికే కొందరి కార్యాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతోనే కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పించింది.

English summary
Maharashtra Politics cricis: Maharashtra Chief Minister Uddhav Thackeray wanted to resign from the post on Monday. chief minister reportedly wanted to announce the decision at 5 pm today via social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X