ఢిల్లీకి విజయ్ - మోదీతో మీట్.. సోనియా తో లంచ్..!!
తమిళనాడు సీఎం ఢిల్లీ బాట పడుతున్నారు. రేపు అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ చేసుకోను న్నారు. ఆ తరువాత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇక... ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రపతి ముర్ముతో పాటుగా ప్రధాని మోదీ.. సోనియా గాంధీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానితో భేటీ వేళ కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. అదే విధంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ విజయ్ సమావేశం అవ్వనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వేళ ప్రధాని ప్రత్యేకంగా విజయ్ కు అభినందనలు తెలిపారు. తమిళనాడు కు కేంద్రం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా మరో నాలుగు పక్షాల మద్దతుతో సీఎం పీఠం దక్కించుకున్న విజయ్ రేపు (బుధవారం) సభలో బలం నిరూపించుకోనున్నారు. అన్నా డీఎంకే చీలక వర్గం సైతం విజయ్ కు పరోక్షంగా మద్దతు ఇవ్వనుంది. బల పరీక్షలో విజయ్ సులభంగా నే మెజార్టీని నిరూపించుకోనున్నారు. ఇక.. ప్రభుత్వ మద్దతు కూటమి ఎమ్మెల్యేలతో విజయ్ ప్రత్యేకం గా సమావేశం అవుతున్నారు. ఆ తరువాత విజయ్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ప్రధాని మోదీ సహా అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ కోరారు. రాష్ట్రపతిని కలవాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు
ఇక, ప్రధాని తో మర్యాద పూర్వకంగా విజయ్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. అదే విధంగా హోం మంత్రి అమిత్ షా, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ విజయ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు సంబంధించిన పలు అంశాల పైన చర్చించనున్నారు. ఇక.. కాంగ్రెస్ అగ్ర నేత నివాసానికి విజయ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు సోనియా , ప్రియాంకతోనూ విజయ్ భేటీ కానున్నారు. విజయ్ ను లంచ్ కు ఆహ్వానించారు. అదే విధంగా ప్రభుత్వ ఏర్పాటులో తనకు సహకరించిన ఖర్గే, సీపీఐ- సీపీఎం అగ్ర నేతలతోనూ విజయ్ ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్తుండటంతో విజయ్ పర్యటన పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications