వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో ముఖ్యమంత్రి కార్యాలయాలు.. త్వరలోనే రూ.10కి భోజనం పథకం..

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేవ్ ఠాక్రే విననూత్న ప్రకటనలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో ముఖ్యమంత్రి కార్యాలయాలు(సీఎంవోలు) ఏర్పాటు చేస్తామన్నారు.

ఆయా ఆఫీసులను ముంబైలోని మెయిన్ ఆఫీసుకు అనుసంధానం చేస్తామని, తద్వారా సీఎంతోగానీ, సీఎంవోతోగానీ పని పడే ప్రజలు ముంబై దాకా రావాల్సిన బాధ తప్పుతుందని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆరు(అమరావతి, ఔరంగాబాద్, కొంకణ్, నాగపూర్, నాసిక్, పుణే) డివిజన్లున్నాయి. అంటే ఆరు చోట్ల సీఎంవోల్సి ఏర్పాటుచేస్తారన్నమాట.

 CMOs to be set up in all Maharashtra divisions, says Uddhav Thackeray

రూ.10కే 'శివభోజనం'
సౌత్ ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలవుతోన్న తక్కువ ధరకే భోజనం లాంటి పథకాన్ని త్వరలోనే మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. శివభోజన్ పేరుతో రూ.10కే పేదలకు ఆహారం అందిస్తామని, పైలట్ ప్రాజెక్టుగా ముందు 50 చోట్ల దీన్ని మొదలుపెడతామని సీఎం ఉద్దేవ్ చెప్పారు.

రాష్ట్రంలో టూరిజం డెవెంలప్ మెంట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టామని, 2023నాటికి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని, వరి మద్దతు ధరకు అదనంగా మరో రూ.200 రైతులకు చెల్లిస్తామని సీఎం వెల్లడించారు.

English summary
Thackeray said these CMOs would be connected to the main one in Mantralaya, and claimed the move was part of his government's efforts to decentralise power
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X