వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో బీజేపీదే హవా, తమిళనాడులో బేజారు: దక్షిణాదిన ఎవరికి ఎన్ని సీట్లు అంటే?

|
Google Oneindia TeluguNews

న్యూస్8-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలో దక్షిణాదిన కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపించడం లేదు. పలు జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హవా కొనసాగుతోంది. యూపీఏ మరోసారి వెనుకంజలో పడింది. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కానున్నారని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ గెలుపును చెబుతున్నాయి. రిపబ్లిక్ -సీ ఓటరు బీజేపీకి 287, కాంగ్రెస్‌కు 128, రిపబ్లిక్ భారత్-జన్‌కీ భారత్ బీజేపీ కూటమికి 305, కాంగ్రెస్ కూటమికి 124, న్యూస్ నేషన్ బీజేపీ కూటమికి 282-290, కాంగ్రెస్ కూటమికి 118-290, టైమ్స్ నౌ -వీఎంఆర్ బీజేపీ కూటమికి 306, కాంగ్రెస్ కూటమికి 132, టుడేస్ చాణక్య బీజేపీ కూటమికి 340, కాంగ్రెస్ కూటమికి 70 సీట్లు వస్తాయని తెలిపింది.

ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...

 CNN News18-IPSOS Exit Poll: BJP to Win Big in Karnataka, DMK in TN

CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. బీజేపీ కూటమికి భారీ మెజార్టీ రానుంది. అయితే దక్షిణాదిన బీజేపీ ప్రభావం అంతంతే అని తేలింది. ఈ సర్వే ప్రకారం ఏపీలో వైసీపీకి 13 నుంచి 14 సీట్లు, వైసీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని తేలింది. కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకోనుంది. అదే సమయంలో తమిళనాడులో డీఎంకే - కాంగ్రెస్ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకోనుంది.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు కానుంది. కాంగ్రెస్ 5-7 సీట్లు, బీజేపీ 21-23 సీట్లు గెలుచుకుంటుందని CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కేరళలో ఎల్డీఏఫ్‌కు 11-13 సీట్లు, యూడీఎఫ్‌కు 7-9 సీట్లు, బీజేపీకి 0-1 సీటు రానున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమికి 14-16 సీట్లు, డీఎంకుకు 22-24 సీట్లు రానున్నాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి 0-1 సీటు, బీజేపీకి 4-5 సీట్లు రానున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 12-14 సీట్లు, కాంగ్రెస్‌కు 1-2 సీట్లు, బీజేపీకి 1-2 సీట్లు, మజ్లిస్ పార్టీకి 1 సీటు రానుంది.

English summary
News18-IPSOS Exit Poll results. BJP to Win Big in Karnataka, DMK in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X