బొగ్గు కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తయింది: సీబీఐ
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తైనట్లు ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. హిందాల్కో, ఇతరుల పాత్రపై దర్యాప్తు పూర్తయినట్లు సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది వీకే శర్మ వెల్లడించారు. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌తోపాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసులో సంబంధించిన అన్ని విషయాలను, డాక్యుమెంట్లను దాఖలు చేసినట్లు కోర్టుకు సీబీఐ వివరించారు. దానికి సంబంధించిన నివేదికను మార్చి 11న పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఈ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు, మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్, పలువురిని సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications