వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు కుంభకోణం కేసు: మధు కోడాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బొగ్గు కుంభకోణంలో కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు జనవరి 22 వరకు నిలుపుదల చేసింది. దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో తదుపరి విచారణ వరకు బెయిల్‌ మంజూరు చేసింది.

అంతేగాక, అతనిపై విధించిన రూ. 25 లక్షల జరిమానాపై కూడా స్టే విధిస్తూ జస్టిస్‌ అను మల్హోత్రా తీర్పు వెలువరించారు. తనకు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ మధుకోడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సీబీఐ వివరణ కోరుతూ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

Coal scam: Delhi HC stays Madhu Koda's jail term

జార్ఖండ్‌లోని బొగ్గు గనులను కోల్‌కతాలోని విని ఐరన్‌ ఆండ్‌ స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ సంస్థకు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలతో గతంలో ముధుకోడాతో పాటు జార్ఖండ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, జోషీలకు ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి దాఖలైన విషయాలన్నింటినీ జనవరి 22న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

English summary
Delhi High Court on Tuesday stayed the special CBI court's order of awarding three years imprisonment to former Jharkhand chief minister Madhu Koda in connection with the coal scam case. The HC has also stayed the fine imposed on him till the next date of hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X