వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coal Scam: కూల్ గా సీబీఐ దాడులు, నాలుగు రాష్ట్రాలు, 45 ప్రాంతాలు, శనివారం 70 ఎంఎం సినిమా, పాపం !

|
Google Oneindia TeluguNews

కోల్ కత్తా/ లక్నో/ పాట్నా/ జార్ఖండ్: బోగ్గు స్కామ్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు 70 MM సినిమా చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లో బోగ్గు స్కామ్ జరిగినా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు వారం ముందు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీహార్ లో కూడా సీబీఐ దాడులు జరిగాయి. నాలుగు రాష్ట్రాల్లో 45 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ దాడులు చడిచప్పుడు లేకుండా కూల్ గా జరగడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు, వారి అనుచరులు షాక్ కు గురైనారు.

facebook: అంకితా అదుర్స్, సొల్లు కార్చుకున్న నాయర్, రాజస్థాన్ లో స్కెచ్, కేరళలో, ఆంటీలు, అమ్మాయిలు !facebook: అంకితా అదుర్స్, సొల్లు కార్చుకున్న నాయర్, రాజస్థాన్ లో స్కెచ్, కేరళలో, ఆంటీలు, అమ్మాయిలు !

ఇసీఎల్ బోగ్గు స్కామ్

ఇసీఎల్ బోగ్గు స్కామ్

అక్రమ మైనింగ్, కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (ఇసీఎల్)లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇసీఎల్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ బోగ్గు స్కామ్ అక్రమాల కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేస్తున్నారు.

 ఒక్కరోజులో 70 MM సినిమా

ఒక్కరోజులో 70 MM సినిమా

అక్రమ బోగ్గు స్కామ్ కు సంబంధించి శుక్రవారం సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం, శనివారం నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు చెయ్యడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఒక్కసారిగా షాక్ కు గురైనారు. ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం, వెంటనే నోటీసులు ఇవ్వడం, ఏకకాలంలో సీబీఐ సోదాలు జరగడంతో ఇసీఎల్ కేసులోని నిందితులు, వారి అనుచరుల దిమ్మతిరిగిపోయింది.

కింగ్ పిన్ అనూప్ మాఝి

కింగ్ పిన్ అనూప్ మాఝి

పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ వ్యక్తి అనూప్ మాఝి ఈ బోగ్గు స్కామ్ కేసులో ప్రముఖ నిందితుడు, కింగ్ పిన్ అని సీబీఐ అధికారులు అంటున్నారు. శనివారం సీబీఐ అధికారులు అనూప్ మాఝి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. అనూప్ సన్నిహితులు, అనుచరుల ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 టార్గెట్ ఎవరు ?

టార్గెట్ ఎవరు ?

ఇసీఎల్ వ్యవస్థాపకులు ఇద్దరు, ఇద్దరు ప్రముఖ అధికారులు, ఒక భద్రతా అధికారితో పాటు ప్రైవేట్ వ్యక్తి అయిన అనూప్ మాఝి ఈ బోగ్గు స్కామ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శనివారం అందరికి ఒకేసారి సీబీఐ అధికారులు సినిమా చూపించారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తో పాటు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన బీహార్ లో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

Recommended Video

#JusticeForSugaliPreethi:న్యాయం కోసం ఇంకెన్నాళ్ళు?|Lawyer Seema Kushwaha Take-up Sugali Preethi Case
అమిత్ షా టూర్ టైమ్ లో ఇలా !

అమిత్ షా టూర్ టైమ్ లో ఇలా !

అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన టైమ్ లో సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం, వెంటనే దాడులు చెయ్యడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. బోగ్గు స్కామ్ కేసులో మా మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Coal Scam: CBI on Saturday has conducted raids on 45 places in four states in connection with a case of illegal mining and scam in ECL
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X