వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌గేట్: హైదరాబాద్ కంపెనీ డైరెక్టర్లపై సిబిఐ చార్జిషీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI files first chargesheet
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అక్రమాలపై సోమవారం ఉదయం ఢిల్లీ ట్రయల్ కోర్టులో చార్జిషీటు దాఖలైంది.

ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై అభియోగపత్రం దాఖలు చేశారు. ఆ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు హరిశ్చంద్ర ప్రసాద్, త్రివిక్రమ్ ప్రసాద్‌పై మోసం,కుట్ర అభియోగాలు నమోదు చేసింది.

బొగ్గు బ్లాకుల కేటాయింపుల కోసం నవభారత్ సంస్థ మరికొన్ని కంపెనీలతో కలిసి వాస్తవాలను కప్పిపుచ్చిందని సిబిఐ ఆరోపించింది. నవభారత్‌కు ఒడిషాలో రెండు కోల్ బ్లాక్స్‌ను కేటాయించారు. చార్జిషీట్ దాఖలుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 11వ తేదీన సిబిఐని ఆదేశించింది.

సిబిఐ 16 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది. వాటిలో ఎఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్స్, జెఎల్‌డి యవత్మాల్ ఎనర్జీ, విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్, జెఎఎస్ ఇన్‌ఫ్రాస్ట్రకర్ క్యాపిటల్ తదితరాలు ఉన్నాయి.

English summary
The CBI on Monday filed its first chargesheet in the coal block allocation scam against Navbharat Power Private Ltd and its two directors — P Trivikrama Prasad and Y Harish Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X