వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమైతే ప్రధాని కూడా దోషే: కోల్‌గేట్‌పై పరేఖ్ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Coalgate: name PM too, says former Coal Secretary Parakh
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాము దోషులమైతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనన్నారు. ప్రధాని పైన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. బొగ్గు కుంభకోణం కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఒరిస్సాలోని బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగి ఉంటే ప్రధాని కూడా అందుకు కారణమవుతారని పరేఖ్ అన్నారు. బొగ్గు కేటాయింపులలో ప్రధానిదే తుది నిర్ణయమని, ఆయన కూడా నిందితుడవుతారన్నారు. అలాంటప్పుడు ఆయనపై అభియోగాలు ఎందుకు మోపలేదన్నారు.

బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లయితే తనతో పాటు బిర్లా, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా బాధ్యులే అన్నారు. బొగ్గు క్షేత్రాలను అంతిమంగా అప్రూవ్ చేసింది ప్రధానే అన్నారు. బొగ్గు కేటాయింపు అవకతవకలపై సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కేటాయింపుల సమయంలో ప్రధాని వద్ద బొగ్గు శాఖ ఉంది.

పరేఖ్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన డిగ్గీ

బొగ్గు కుంభకోణం కేసులో తాము దోషులమైతే ప్రధాని కూడా దోషేనన్న పిసి పరేఖ్ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పరేఖ్ ఏమైనా చెప్పదల్చుకుంటే సిబిఐకి చెప్పాలన్నారు.

English summary
If there was a conspiracy to help industrialist Kumar Mangalam Birla land two coal blocks in Odisha for his firm, then the Prime Minister must be counted among the conspirators, said former Coal Secretary PC Parakh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X