వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం దుమారం రేపుతోంది. 1984లో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం అనతికాలంలోనే అసాధారణ స్థాయికి చేరింది. హౌజింగ్ లోన్లు, ప్రాపర్టీ లోన్లు, రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఇలా అనేక రకాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సదరు సంస్థను వివాదాలు చుట్టుముట్టాయి. ప్రజల నుంచి సేకరించిన నిధులు దేశాలు దాటించిందనే ఆరోపణలు మూటగట్టుకుంది. 31 వేల కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటూ.. కోబ్రా పోస్ట్ ప్రచురించిన కథనం సంచలనంగా మారింది.

 కోబ్రా పంజా..!

కోబ్రా పంజా..!

డీహెచ్ఎఫ్ఎల్ ప్రజల నుంచి నిధులు సేకరించడమే గాకుండా, వివిధ బ్యాంకుల నుంచి పెద్దమొత్తాల్లో రుణాలు తీసుకుంది. అయితే ఆ సంస్థ యజమాన్యం డొల్ల కంపెనీలకు నిధులను బదిలీ చేస్తూ.. దేశం దాటించిందంటూ కోబ్రా పోస్ట్ వివరాలు వెల్లడించింది. ఫారిన్ కంట్రీస్ లో ఆస్తులు కొనుగోలు చేయడానికే నిధులు మళ్లించినట్లు ఆ కథనంలో పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ల బంధువులు, స్నేహితులకు అడ్డగోలుగా లోన్లు మంజూరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డీహెచ్ఎఫ్ఎల్ పెద్దమొత్తంలో లోన్లు తీసుకున్నట్లు ఆ కథనంలో రాసింది.

డొల్ల కంపెనీలు.. దేశాలు దాటిన నిధులు..!

డొల్ల కంపెనీలు.. దేశాలు దాటిన నిధులు..!


డిపాజిట్లు, లోన్ల ద్వారా సేకరించిన నిధులను.. ఒకేసారి డొల్ల కంపెనీలకు డీహెచ్ఎఫ్ఎల్ బదిలీ చేసినట్లు పేర్కొంది కోబ్రా పోస్ట్. ఎస్‌బీఐ నుంచి 11 వేల కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4 వేల కోట్ల రూపాయల లోన్లు సేకరించిన సదరు కంపెనీ.. డిపాజిట్ల రూపంలో జనాల నుంచి 9 వేల 225 కోట్ల రూపాయలు, ఇతర మార్గాల ద్వారా 13 వేల 567 కోట్ల రూపాయలను సమకూర్చుకుందని పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ నికర విలువ 8 వేల 795 కోట్ల రూపాయలుంటే.. తీసుకున్న లోన్లు 96 వేల 880 కోట్లుగా తెలిపింది కోబ్రా పోర్టల్.

డీహెచ్ఎఫ్‌ఎల్ నిధుల వ్యవహారంలో గోల్ మాల్ జరిగిందనే కథనం పబ్లిష్ చేసిన కోబ్రా పోస్ట్.. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధముందని ఆరోపించింది. బీజేపీతో ఆ కంపెనీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నట్లుగా పేర్కొంది. పార్టీ ఫండ్ కింద బీజేపీకి 19.5 కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చినట్లు తెలిపింది. అయితే నికర లాభాల్లో నుంచి 7.5 శాతం డొనేషన్లుగా ఇవ్వొచ్చన్నది కంపెనీస్ యాక్ట్ 2013లో ఉంది. కానీ డీహెచ్ఎఫ్‌ఎల్ కు సంబంధించిన డొల్ల కంపెనీలు ఎలాంటి లాభాలు గడించలేదన్నది కోబ్రా పోస్ట్ పాయింట్ అవుట్ చేసిన విషయం.

 షేర్ ఢమాల్..!

షేర్ ఢమాల్..!

కోబ్రా పోస్ట్ కథనంపై దుమారం రేగడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్ స్పందించింది. కోబ్రా పోస్ట్ 64 ప్రశ్నలు సంధిస్తూ ఒక మెయిల్ పెట్టిందని.. ఆన్సర్ ఇచ్చేలోగా ఇలాంటి కథనం ప్రచురించినట్లు చెబుతోంది. అదలావుంటే డీహెచ్‌ఎఫ్‌ఎల్ స్కామ్ పేరిట కోబ్రా పోస్ట్ ప్రచురించిన కథనం స్టాక్ మార్కెట్ లో ప్రభావం చూపింది. NSE లో డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఒక్కో షేర్ ధర 9 రూపాయల మేర పడిపోయింది. మరోవైపు సదరు సంస్థ నిధులు మళ్లించిందనే ఆరోపణలపై కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా తెరమీదకు వచ్చారు. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

English summary
cobra post news portal alleges 31000 crore fraud by dhfl house loan finance company. DHFL promotors of siphoning off the huge money into their shell companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X