• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాఫీ వాటాదారుల మేలుకోసం డిజిటల్ పద్ధతులను ప్రారంభించిన కాఫీ బోర్డు

|

"సాంకేతికతను మంచి పనికోసం వినియోగిస్తే సమాజంలో ఎన్నో ఆశాదృక్పథమైన మార్పులు తీసుకురావచ్చు. సాంకేతికత ఎప్పుడూ కొత్తపుంతలు తొక్కుతుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటామన్నది మనపై ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా కాఫీ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది రైతులకు ఈ సాంకేతికత అందించడం ద్వారా వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించిన వారమవుతాం. ఈ టెక్నాలజీని వినియోగించడంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. ఇంకా తక్కువ సమయంలోనే సాంకేతికత వినియోగంపై సుదూరంగా ప్రయాణించాల్సి ఉంది"అని కాఫీబోర్డు సీఈవో మరియు సెక్రటరీ శ్రీవాత్స కృష్ణ అన్నారు.

సెప్టెంబర్ 4, 2018న ఆవిష్కరించిన అప్లికేషన్లు బ్లాక్ చైన్ టెక్నాలజీలో వినియోగించడం దేశంలోనే తొలిసారి అవుతుంది. సమస్యలను త్వరతగతిన పరిష్కారం చూపేందుకు ఐవీఆర్‌ ఆపరేషన్స్ కూడా చేపట్టినట్లు కృష్ణ చెప్పారు.

Coffee board launches digital initiatives to benefit coffee stakeholders

ఈ సందర్భంగా డ్రోన్లను వినియోగించి వ్యవసాయం ఎలా చేయాలో ప్రదర్శించడం జరిగింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు రిమోట్ కంట్రోల్ ద్వారా డ్రోన్ ఆపరేషన్లను ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా కాఫీ పంటలపై నీరు చల్లారు. ఇలా డ్రోన్ల టెక్నాలజీ వినియోగించి వ్యవసాయం చేసేందుకు క్విడిచ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ మరియు స్టార్క్ డ్రోన్స్ కంపెనీలు సహకరిస్తున్నాయి.

Coffee board launches digital initiatives to benefit coffee stakeholders

కాఫీ కనెక్ట్ పేరుతో కొత్తగా మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా కాఫీ బోర్డుకు సంబంధించిన పలు సేవలు పొందడంతో పాటు ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్న్‌మెంట్ సహకారంతో కాఫీ బోర్డు ఈ యాప్‌ను తయారు చేసింది.

Coffee board launches digital initiatives to benefit coffee stakeholders

కాఫీబోర్డు EKA అనలిటిక్స్ పెస్ట్ ఐడెంటిఫికేషన్ మొబైల్ యాప్ ప్రారంభం కాఫీ కృషి తరంగా ఆవిష్కరణ, తక్కువ సమయంలో బోర్డు సేవలు ఎక్కువగా పొందేందుకు ఐవీఆర్ఎస్ మొబైల్ ఎక్స్‌టెన్షన్ సేవలు ప్రారంభం శాశ్వత కాఫీ ఉత్పత్తి కానీ, వ్యవసాయ సమస్యలపై కానీ , వర్షాభావ సమస్యలు, పంటకు పురుగు పట్టడంలాంటి సాంకేతిక సమాధానాలు గుర్తించిన తర్వాత EKA అనలిటిక్స్ సహకారంతో కాఫీబోర్డు మరికొన్ని అప్లికేషన్లు రూపొందించింది. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన వాటిని పరీక్షిస్తున్నారు. హైపర్ లోకల్ వెదర్ ఫోర్‌కాస్ట్, పెస్ట్ ఐడెంటిఫికేషన్ అప్లికేషన్, లీఫ్ రస్ట్ డిసీస్ ఫోర్ కాస్ట్, బ్లాక్ చైన్ బేస్డ్ మార్కెట్ ప్లేస్ యాప్‌లు కాఫీ బోర్డు తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

Coffee board launches digital initiatives to benefit coffee stakeholders

lok-sabha-home

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Technology, when used for good, has a distinctive characteristic of bringing positive and disruptive change. It is always evolving and it is up to us to harness the power of technology to bring in efficiency and ensure long term sustainable livelihoods to the lacks of farmers involved in coffee industry across the country. These applications and solutions are only the beginning. There is a long road ahead and we have much to do in very little time,” Mr. Srivatsa Krishna IAS, CEO & Secretary, Coffee Board, said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more