వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫీ డే కింగ్ మృతిపై నేతల సంతాపం.. షాక్‌కు గురయ్యామంటున్న కేటీఆర్, దీదీ

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌ : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, సీఎండీ వి.జి. సిద్ధార్థ మృతిపై నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు కావడంతో రాజకీయ నేతలతో కూడా మంచి పరిచయాలున్నాయి. ఆ క్రమంలో ఆయన ఆకస్మిక మరణం పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన మృతి చెందిన తీరు తనను షాక్‌కు గురిచేసింద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

వి.జి. సిద్ధార్థ చ‌నిపోయిన తీరు త‌న‌ను బాధ‌కు గురిచేసింద‌ంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఆయన మృదుస్వభావని, సౌమ్యుడని కొనియాడారు. సిద్ధార్థ చాలా స్నేహపూర్వకంగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కాఫీ డే ఉద్యోగులకు మనోధైర్యం కలగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

coffee day king death leaders tribute ktr mamata banarjee tweets

వి.జి. సిద్ధార్థ మృతిపై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన చనిపోవడం దురదృష్టకరమని.. తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. కొన్ని ఏజెన్సీల వ‌త్తిడి వ‌ల్లే సిద్ధార్థ‌ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అత‌ని లేఖ ద్వారా అర్థమవుతోందన్నారు. వివిధ కంపెనీల అధినేతలు తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్నారని ట్వీట్ చేశారు. సిద్ధార్థ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్నారు దీదీ. ప‌రిశ్ర‌మ‌ల‌ను నిర్వీర్యం చేస్తే ఆర్థిక ప్ర‌గ‌తికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. నిరుద్యోగం కూడా స్థాయిని మించి పెరిగి పోతుంద‌న్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా శాంతి యుతంగా ప‌నిచేయాల‌ని సూచించారు. దాని ద్వారా విశ్వాసం పెరుగుతుంద‌న్నారు. రాజ‌కీయ క‌క్ష్య‌తో వివిధ ఏజెన్సీల‌ను వాడుకోవ‌డం స‌రికాద‌న్నారు.

English summary
Leaders tributes for Cafe Coffee Day founder, CMD V.G. Siddhartha's death. KTR and Mamata Banerjee tweeted that they were shocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X