బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి మిస్టరి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఆ రోజు ఏం జరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ ఎలా చనిపోయారు అనే విషయంలో పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్య నిపుణులు ఆ నివేదిక ఇచ్చారని కర్ణాటకలోని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా అన్నారు. వి.జి. సిద్దార్థ మృతి కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుతో ఆ కేసు మిస్టరి ఓ కొలిక్కి వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు.

ఆ రోజు ఏం జరిగింది !

ఆ రోజు ఏం జరిగింది !

జులై 29వ తేదీన మంగళూరు సమీపంలోని ఉల్లాల సమీపంలోని నేత్రావతి నది ఫ్లై ఓవర్ సమీపంలో కారు దిగిన విజి. సిద్దార్థ డ్రైవర్ ను అక్కడే ఉండాలని చెప్పి వెళ్లారు. తరువాత వి.జి. సిద్దార్థ నేత్రావతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది. అప్పులు ఇచ్చిన వారు ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో వి.జి. సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేశారు.

<strong>కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!</strong>కాఫీ కింగ్ సిద్దార్థ ఇంటిలో మరో విషాదం, కొడుకు లేడని చివరి వరకు ఆ తండ్రికి తెలీదు!

అంత పిరికివాడు కాదు

అంత పిరికివాడు కాదు

కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సిద్దార్థ కనపడకుండా పోయిన రెండు రోజుల తరువాత నేత్రవాతి నదిలో ఆయన శవమై కనిపించారు. సిద్దార్థ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చెయ్యాలని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ఆయన సన్నిహితులు డిమాండ్ చేశారు. విజి. సిద్దార్థ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని ఆయన బంధువులు అన్నారు.

పోస్టుమార్టుం నివేదిక

పోస్టుమార్టుం నివేదిక

ఆగస్టు 2వ తేదీన విజి. సిద్దార్థ మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. వి.జి. సిద్దార్థ మృతదేహం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి అనే వివరాలు అందులో ఉన్నాయి. అయితే ఆ రోజు వైద్యులు ఇచ్చిన నివేదికను పోలీసులు బయటపెట్టలేదు.

 ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు

ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు

కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్యులు అంతిమ నివేదిక ఇచ్చారని వెలుగు చూసింది. వి.జి. సిద్దార్థ ఫోరెన్సిక్ నివేదిక మా చేతికి వచ్చింది, ఆయనది ఆత్మహత్య అనే విషయం తెలిసిందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. అయితే అధికారికంగా పై అధికారులు అన్ని విషయాలు చెబుతారని ఆ పోలీసు అధికారి తెలిపారు.

ఎందుకు సీక్రెట్ ?

ఎందుకు సీక్రెట్ ?

వి.జి. సిద్దార్థ మృతి కేసులో అంతిమ నివేదిక వచ్చిన తరువాతే అన్ని విషయాలు చెబుతామని అధికారులు ఆరోజు అన్నారు. అయితే పోస్టుమార్టుం అంతిమ నివేదిక వచ్చినా పోలీసులు మాత్రం ఆ వివరాలు అధికారికంగా బయటకు చెప్పడంలేదు. సిద్దార్థ ఎలా చనిపోయారు ? అనే విషయం మంగళూరు పోలీసు అధికారులు అధికారికంగా చెప్పవలసి ఉంది.

నెల రోజుల్లో తండ్రి కొడుకు

నెల రోజుల్లో తండ్రి కొడుకు

కాఫీ కింగ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ కుటుంబంలో మరో విషాదం. వి.జి. సిద్దార్థ తండ్రి కాఫీ తోటల యజమాని గంగయ్య హెగ్డే మృతి చెందారు. అనారోగ్యంతో మైసూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగయ్య హెగ్డే ఆదివారం మరణించారు. నెల రోజుల గడవక ముందే తండ్రి, కొడుకు మరణించడంతో సిద్దార్థ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

English summary
Bengaluru: Coffee Day owner VG Siddharatha Death case, Autopsy Report says, It is a suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X