వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో 4 వేల మంది ఉద్యోగులపై వేటు

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుండి ఈ క్వార్టర్‌కు 4 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుండి ఈ క్వార్టర్‌కు 4 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు. కంపెనీ రెండో క్వార్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది కంపెనీ.

కాగ్నిజెంట్ కంపెనీలో 2,61,200 మంది ఉద్యోగులుంటే జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి రెండో క్వార్టర్ ఫలితాల్లో తెలిసింది.

టాప్ దేశీయ ఐటీ అవుట్‌సోర్స్ కంపెనీల్లో అత్యధికంగా కాగ్నిజెంట్ కంపెనీలోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టుగా ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Cognizant headcount drops by over 4,000, raises lower-end of 2017 guidance

టీసీఎస్, ఇన్పోసిస్, టెక్ మహీంద్రా కంపెనీల్లో కూడ ఉద్యోగులు తగ్గిపోయారు. కానీ, ఈ మేర తగ్గింది. కాగా, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకొన్నాయి. అయితే కాగ్నిజెంట్ తన రెవిన్యూ గైడెన్స్‌ను పెంచింది.

గతంలో తక్కువగా అంచనావేసిన 8-10 శాతం వృద్దిని 9 -10 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాక మూడో క్వార్టర్‌లో వృద్దిరేటు 1.6-3 శాతముంటుందని కాగ్నిజెంట్ అంచనావేస్తోంది.

గురువారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ రెవిన్యూలు తొలి క్వార్టర్ కంటే 3.5 శాతం పెరిగి 3.67 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. నికర లాభం కూడ ఈ క్వార్టర్‌లో 470 మిలియన్ డాలర్లుగా నమోదైంది.

గత ఏడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభం 252 మిలియన్ డాలర్లు మాత్రమే. క్వార్టర్లీ రెవిన్యూలు కూడ కంపెనీని 8.9 శాతం పెరిగినట్టు కాగ్నిజెంట్ తెలిపింది. రెండో క్వార్టర్‌లో బలమైన ఫలితాలను ప్రకటించామని కంపెనీ తెలిపింది. ఒక్కో షేరకు 0.80 డాలర్ల లాభం చేకూరుతోందని కంపెనీ పేర్కొంది.గత ఏడాది ఇది 0.41 డాలర్లుగా మాత్రమే ఉందని కాగ్నిజెంట్ తెలిపింది.

English summary
Cognizant’s second-quarter revenue rose 3.5% sequentially and the IT company raised the lower-end of its revenue range for the full year. But the company’s headcount fell by over 4,000 employees -- the steepest drop among the top Indian IT outsourcers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X