వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: కాగ్నిజెంట్ లో ఉద్యోగాల కోతలేదు, కొత్తగా నియామకాలు: రాజీవ్

అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగ్నిజెంట్ లో భారీ ఉద్యోగాల కోత ఉండబోతోందంటూ బలవంతంగా ఉద్యోగులపై వేటు వేస్తుందంటూ వస్తోన్న రూమర్లను కంపెనీ కొట్టిపారేసింది.

కొంతకాలంగా కాగ్నిజెంట్ ఉద్యోగులకు పింక్ స్లిప్ లను జారీచేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే ఈ ప్రచారం నేపథ్యంలో కంపెనీ ఈ విషయమై మరింత స్పష్టతను ఇచ్చింది.

<strong>ఇండియన్ టెక్కీలకు షాకిచ్చిన కాగ్నిజెంట్, కారణమిదే!</strong>ఇండియన్ టెక్కీలకు షాకిచ్చిన కాగ్నిజెంట్, కారణమిదే!

ప్రపంచంలో చోటుచేసుకొన్న మార్పులు సాఫ్ట్ వేర్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి.ఈ ప్రభావం కారణంగా ఖర్చులను తగ్గించుకొనేందుకుగాను ఐటీ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ విషయమై ఉద్యోగులకు కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజీవ్ మెహాతాను తన ఉద్యోగులకు లేఖ రాశాడు. ఉద్యోగులను తీసివేయడం లేదని ఆయన ప్రకటించారు.

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కాగ్నిజెంట్

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కాగ్నిజెంట్

కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఆ కంపెనీ ప్రెసిడెంట్ రాజీవ్ మోహతా లేఖ రాశాడు. కంపెనీకి చెందిన ఉద్యోగులను తీసివేయడం లేదంటూ ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారీ ప్యాకేజీలను ఇచ్చి ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ కాగ్నిజెంట్ పై ప్రచారం సాగింది.ఈ తరుణంలో రాజీవ్ మెహాతా రాసిన లేఖ ఉద్యోగులకు స్వాంతన చేకూర్చింది.

పనితీరుపై సమీక్షలు తప్పవు

పనితీరుపై సమీక్షలు తప్పవు

పరిశ్రమ ఉత్తమ పద్దతులకు అనుగుణగా ప్రతి ఏటా చేపట్టినట్టుగా ఈ ఏడాది కూడ ఫర్ ఫామెన్స్ సమీక్షను చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. గత ఏడాది పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడమే ఈ సమీక్ష ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ ఏడాది కూడ సమీక్షలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఇది తర్వాతి ఏడాది లక్ష్యాలను నిర్ధేశించనుందని రాజీవ్ మెహతా ప్రకటించారు.

ప్రచారాన్ని కొట్టిపారేసి కాగ్నిజెంట్

ప్రచారాన్ని కొట్టిపారేసి కాగ్నిజెంట్

భారత్ లో పనిచేస్తున్న సుమారు 6 వేల మంది ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించినట్టు ప్రచారం సాగుతోంది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు కంపెనీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రోగ్రాం కూడ ప్రకటించిందని రిపోర్టులు కూడ వచ్చాయి. అయితే బలవంతంగా ఉద్యోగులను ఇంటికి పంపేస్తోందని ఐటీ ఉద్యోగసంఘాలు ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలు మేరకు ఐటీ గ్రూపులు వివిధ రాష్ట్రాల్లోని కార్మికశాఖ అధికారులకు కూడ ఫిర్యాదులు చేశారు.కానీ, ఈ ప్రచారంలో వాస్తవం లేదని కాగ్నిజెంట్ మేనేజ్ మెంట్ కొట్టిపారేసింది.

కొత్త నియామకాలు

కొత్త నియామకాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక మార్కెట్లలో తాము నియామకాలను చేపట్టనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. చాలా ఏళ్ళ నుండి అమెరికాలో రిక్రూట్ మెంట్ పెంచుతున్నట్టు కూడ తెలిపింది. తాము నియామకాలు చేపట్టబోయే దేశాల్లో భారత్ కూడ ఉందని లేఖలో రాజీవ్ మెహాతా చెప్పారు. డేటా సైన్స్ ,బిగ్ డేటా , మిషన్ లెర్నింగ్, అడోబ్ స్టాక్ వంటి వాటిలో రీస్కిలింగ్ ప్రోగ్రామ్స్ ను ఉద్యోగాలు చేపట్టాలని మెహాతా సూచించారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ లో ప్రపంచవ్యాప్తంగా 2,62,000 మంది ఉద్యోగులున్నారు. వారిలో లక్షా యాభైవేలు భారత్ లోనే ఉన్నారు.

English summary
Cognizant president Rajeev Mehta has written to letter to employees to address concerns over reports of massive layoffs at the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X