వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాటెక్కీలకు షాక్: అమెరికాలో ఉద్యోగులను పెంచనున్న కాగ్నిజెంట్

ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాలపై కఠిన నిబంధనలను అమలు చేయడంతో

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాలపై కఠిన నిబంధనలను అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకొంది కాగ్నిజెంట్.

అమెరికాలో స్థానికంగా ఉండేవారికి 8 వేల ఉద్యోగులను నియమించుకొనే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అలాగే మరో ఏడు సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయనుంది కాగ్నిజెంట్.

Cognizant set to double headcount in the US in CY17

బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం స్ధానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన పరిస్థితులు సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఏర్పడ్డాయి.ఈ తరుణంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ బాటలోనే కాగ్నిజెంట్ కూడ పయనిస్తోంది.

కాగ్నిజెంట్ 2017 లో అమెరికాలో ఎనిమిదివేల మందిని కొత్తగా నియమించుకోనుంది. 2016 అమెరికాలో నాలుగువేల మంది ఐటీ ఉద్యోగులను నియమించుకొంది. ప్రస్తుతం 20 కేంద్రాలకుతోడు యూఎస్ లో మరో ఏడు డెలివరీ కేంద్రాలను కూడ ఏర్పాటు చేయనుంది.

మరో వైపు అమెరికాలో ఉంటున్న సుమారు పదివేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మరో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ నిర్ణయం తీసుకొంది. రానున్న రెండేళ్ళలో 10 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఇన్సోసిస్ ప్రకటించింది.

English summary
Cognizant is set to double their headcount in the United States in CY17,The company is likely to hire up to 8000 employees locally in the US. The company hired 4000 employees in the US in CY16, say sources. They will also be adding seven more delivery centres in the United States to the current 20 centres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X