సహజీవనం తప్పు కాదు .. తల్లిదండ్రులకు జోక్యం చేసుకునే హక్కు లేదన్న హైకోర్టు
మేజర్ అయిన ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించడం తప్పుకాదని అది వారి హక్కు అని పేర్కొంది అలహాబాద్ హైకోర్టు. ఇద్దరు మేజర్ అయిన వారికి శాంతియుతంగా సహజీవనం చేసే హక్కు ఉందని , సహజీవనం చేస్తూ కుటుంబ సభ్యుల వేధింపులను ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించాలని ఒక కేసులో ఎస్‌ఎస్‌పి ఫరూఖాబాద్‌కు ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
ఆసక్తికర తీర్పు ...భర్తకు భరణం చెల్లించాలని భార్యకు కోర్టు ఆదేశం

అబ్బాయి , అమ్మాయి మేజర్లయితే సహజీవనం తప్పేమీ కాదన్న కోర్టు
అపెక్స్ కోర్ట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఒక అబ్బాయి మరియు అమ్మాయి వారి స్వేచ్ఛా సంకల్పంతో జీవిస్తున్నారు . అప్పుడు వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ వారి సహజీవనం పై జోక్యం చేసుకునే అధికారం లేదు అని జస్టిస్ అంజని కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాష్ పాడియాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వుల్లో తెలిపింది.
ఫరూఖాబాద్‌కు చెందిన కామిని దేవి, అజయ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అలహాబాద్ హైకోర్టులో సహజీవనం చేస్తున్న ఓ జంట పిటీషన్
కామినీ దేవి, అజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విషయానికి వస్తే పిటిషనర్లు ఇద్దరూ మేజర్లు, ఒకరినొకరు ప్రేమిస్తున్నారని కోర్టు ముందు వాదించారు. వారు గత ఆరు నెలలుగా సహజీవనం సాగిస్తున్నారు. కాని కామిని తల్లిదండ్రులు ఆమెను వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని వేధిస్తున్నారని, ఈ విషయంలో మార్చి 17 న ఫరూఖాబాద్ ఎస్‌ఎస్‌పికి ఫిర్యాదు చేసినా వారు తమ దరఖాస్తును పెండింగ్‌లో పెట్టారని వారిద్దరూ పేర్కొన్నారు.

వ్యక్తిగత స్వేచ్చ, జీవించటం రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులు అని పేర్కొన్న హైకోర్టు
పిటిషన్ ను విచారించడానికి స్వీకరించిన ధర్మాసనం, "పిటిషనర్లు కలిసి జీవించడానికి స్వేచ్ఛగా ఉన్నారని మరియు వారి శాంతియుత జీవనంలో జోక్యం చేసుకోవడానికి ఏ వ్యక్తిని అనుమతించాల్సిందిగా అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది, ఎందుకంటే జీవిత హక్కు అనేది ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు , దీనిలో ఏ వ్యక్తి తన జీవిత హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు అని ధర్మాసనం పేర్కొంది.

సాంప్రదాయవాదులకు షాక్ .. సహజీవనంపై కోర్టు కీలక తీర్పు
ఇప్పటికే రోజురోజుకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. సహజీవనం చేసేవారు పెరిగిపోతున్నారు. అబ్బాయిలు ,అమ్మాయిలు ఎవరికి నచ్చిన వారితో వారు సహజీవనం చేస్తున్నారు. ఇక దీనిపై సమాజంలో చాలామంది సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారని భగ్గుమంటున్నారు. ఇదిలా ఉంటే మేజర్లు అయిన వారు కలిసి జీవించవచ్చని, సహజీవనం చేయవచ్చని, వారి మధ్య తల్లిదండ్రుల జోక్యం చేసుకోవటం కూడా అనుమతించాలని అవసరం లేదని కోర్టు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.