వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hello I am స్వప్న, ఫ్రం క్రైమ్ బ్రాంచ్: అర్దకేజీ నగలు నొక్కేసిన కిలాడీ లేడీ పోలీసు, కోర్టుకు నామాలు

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూరు (కోవై): Hello I am స్వప్న ఫ్రం క్రైమ్ బ్రాంచ్ అంటూ ఇంతకాలం చెలరేగిపోయింది. లేడీ పోలీసుగా పని చేస్తున్న మహిళ ఆమె చేతివాటం చూపించింది. అసలే క్రైమ్ బ్రాంచ్ లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైయ్యింది. అయితే ఎవరు తవ్విన గోతిలో వారే పడతారని ఆ లేడీ పోలీసు గుర్తించలేకపోయింది. పై అధికారులతో పాటు కోర్టుకు నామం పెట్టి మోసం చేసిన క్రైమ్ బ్రాంచ్ లేడీ పోలీసు సుమారు అర్దకేజీ బంగారు నగలు నొక్కేసింది. చివరికి లేడీ పోలీసు పాపం పండిపోవడంతో తప్పించుకుని తిరుగుతున్న ఆమె కోసం గాలించి చివరికి పట్టుకుని అరెస్టు చేసి జైలు పంపించారు.

వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !

క్రైమ్ బ్రాంచ్ లేడీ పోలీసు

క్రైమ్ బ్రాంచ్ లేడీ పోలీసు


తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లోని ఒండిపుదూరుకు చెంది స్వప్న సుజ (40) సింగానల్లూరు క్రైమ్ బ్రాంచ్ లో లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. క్రైమ్ బ్రాంచ్ లో ఉద్యోగం కావడంతో స్వప్న సుజ అనేక కేసుల విచారణకు పై అధికారులతో కలిసి వెళ్లింది. ఆ సమయంలో దొంగలపై స్వప్న సుజ డేగకన్ను వేసింది.

కోర్టులో బంగారు నగలు

కోర్టులో బంగారు నగలు

అనేక కేసుల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను అరెస్టు చేసిన పోలీసు అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులు కోర్టులో సమర్పించాలి. పోలీసు శాఖలో ఇది ఎప్పటి నుంచి ఉంటున్న రూల్.

అర్దకేజీ నగలు స్వాహా

అర్దకేజీ నగలు స్వాహా

దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగల్లో లేడీ కానిస్టేబుల్ స్వప్న సుజ సుమారు 60 సవర్లు (480 గ్రాములు) నగలు నొక్కేసింది. దొంగల నుంచి నొక్కేసిన నగలు ఇంట్లో దాచిపెట్టుకున్న స్వప్న సుజ మిగిలిన నగలు కోర్టులో సమర్పించింది. అయితే దొంగలు చెప్పిన సమాచారంకు, కోర్టులో సమర్పించిన బంగారు నగలకు దాదాపు అర్దకేజీకి పైగా తేడా రావడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులకు అనుమానం వచ్చింది.

 11 రికవరీ కేసుల్లో చేతివాటం

11 రికవరీ కేసుల్లో చేతివాటం


11 చోరీ కేసులు విచారణలో దొంగల ఇచ్చిన సమాచారం, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న నగలు, కోర్టులో సమర్పించిన నగల్లో సుమారు అర్దకేజీకి పైగ తేడా ఉందని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు గుర్తించారు. కేసుల విచారణలో పాల్గొన్న ప్రతిఒక్క పోలీసుతో పాటు లేడీ కానిస్టేబుల్ స్వప్న సుజను కూడా విచారణ చేశారు. అయితే లేడీ పోలీసు స్వప్న సుజ పొంతనలేని సమాధానం చెప్పింది.

Recommended Video

Megastar Chiranjeevi Praising Odisha Police Officer
క్రైమ్ బ్రాంచ్ కిలాడీ లేడి

క్రైమ్ బ్రాంచ్ కిలాడీ లేడి

స్వప్న సుజ మీద అనుమానం ఎక్కువ కావడంతో గత ఫిబ్రవరి నెలలో ఆమె సెలవుపై వెళ్లిపోయింది. తరువాత కోయంబత్తూరు జిల్లా ఎస్పీ సుమిత్ చరణ్ కిలాడి పోలీసు స్వప్న సుజను సస్పెండ్ చేశారు. స్వప్న సుజ కేసు ఇన్స్ పెక్టర్ శివకుమార్ అప్పగించి విచారణ చెయ్యమని ఆదేశాలు జారీ చేశారు. తన మీద విచారణ కొనసాగుతుందని తెలిసిన స్వప్న మాయం అయ్యింది. అప్పటి నుంచి స్వప్న కోసం గాలించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చివరికి ఆమెను అరెస్టు చేశారు. స్వప్న సుజ నొక్కేసిన అర్దకేజీ బంగారు నగలు ఏం అయ్యాయి ? అవి ఎక్కడ ఉన్నాయి ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారని జిల్లా ఎస్పీ సుమిత్ చరణ్ మీడియాకు చెప్పారు.

English summary
Coimbatore woman police arrested for jewellery theft in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X