• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రేమించాలని టార్చర్, నీ నట్టింటికి వస్తానని ఫోన్, ఆత్మహత్య, కొన్ని గంటల్లో 74% మార్కులతో పాస్ !

|

భోపాల్/ఇండోర్: అందరికంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని ఆ అమ్మాయి నిర్ణయించింది. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించడం, కాలేజ్ మూసివేయడంతో ఆమె ఇంట్లోనే ఇంటర్ పరీక్షలకు బాగా చదివింది. అయితే ప్రతినిత్యం తనను ప్రేమించాలని ఓ యువకుడు టార్చర్ పెట్టాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశాడు.తాను నిన్ను ప్రేమించలేదని ఎన్నిసార్లు చెప్పినా ఆ యువకుడు మాత్రం పట్టించుకోలేదు. యువకుడి వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు ఆ యువతి 74 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయ్యిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

ఇంటర్ అమ్మాయి

ఇంటర్ అమ్మాయి

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో 19 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతోంది. ఎప్పుడు చదువులో ముందుంటున్న అమ్మాయి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని నిర్ణయించింది.

 ఉదయం, సాయంత్రం లవ్ లవ్ అంటూ వెంటపడ్డాడు

ఉదయం, సాయంత్రం లవ్ లవ్ అంటూ వెంటపడ్డాడు

ఉదయం కాలేజ్ కు వెలుతున్న సమయంలో, సాయంత్రం ఇంటికి వెలుతున్న సమయంలో అమ్మాయి వెంటపడిన ఓ యువకుడు తనను ప్రేమించాలని పీడించాడు. అయితే నాకు చదువుతప్పా వేరే ద్యాసలేదని, నేను ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా కాలం అమ్మాయి తప్పించుకుని తిరిగింది. అయితే ఆ యువకుడు మాత్రం ఉదయం, సాయంత్రం అమ్మాయి వెంటపడి తనను ప్రేమించాలని టార్చర్ చేశాడు.

లాక్ డౌన్ ముందు తేల్చి చెప్పిన అమ్మాయి

లాక్ డౌన్ ముందు తేల్చి చెప్పిన అమ్మాయి

నువ్వు నా వెంట ఎంతతిరిగినా నేను మాత్రం నిన్ను ప్రేమించనని, నాకు చదువు, నా తల్లిదండ్రులు ముఖ్యం అని ఆ అమ్మాయి లాక్ డౌన్ కు ముందు తేల్చి చెప్పింది. నేను బాగా చదువుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలని, నన్ను ఇబ్బంది పెట్టరాదని, అలా చేస్తే నీ మేలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఆమ్మాయి ఆ యువకుడిని వేడుకునింది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలులోకి రావడంతో కాలేజ్ మూసివేయడంతో ఆ అమ్మాయి ఇంట్లోనే చదువు ద్యాసలో మునిగిపోయింది.

నీ నంటింటికి వస్తానంటూ ఫోన్ !

నీ నంటింటికి వస్తానంటూ ఫోన్ !

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అమ్మాయి మొబైల్ కు నిత్యం మొబైల్ లో మెసేజ్ లు చేస్తున్న ఆ యువకుడు తనను ప్రేమించాలని వేధింపులకు గురి చేశాడు. అయినా మొబైల్ లో వస్తున్న మెసేజ్ లు చూసి ఆ అమ్మాయి పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం అమ్మాయి తండ్రి, సోదరుడు ధార్ ప్రాంతానికి వెళ్లారు. తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. అమ్మాయి ఇంట్లో ఎవ్వరూ లేరని ఆ యువకుడికి తెలిసింది. అంతే అమ్మాయికి ఫోన్ చేసిన యువకుడు నేను మీ ఇంటికి వస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పే వరకు అక్కడే ఉంటాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీ అమ్మానాన్నా, అన్న అడ్డు వస్తే వాళ్ల ముగ్గురిని అక్కడే చంపేస్తాను అంటూ అమ్మాయిని బెదిరించాడు.

భయంతో ఆత్మహత్య

భయంతో ఆత్మహత్య

ఎక్కడ ఆ యువకుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడో అనే భయంతో అమ్మాయి ఇంట్లో ఉరి వేసుకుంది. ఇంటికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఫ్యాన్ కు వేలాడుతున్న కుమార్తెను చూసి కేకలు వేశారు. స్థానికులు, పోలీసులు వచ్చి అమ్మాయిని కిందకు దించిచూడగా అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

  Cancel Exams - NSUI | కాలేజీలు ఓపెన్ చేయొద్దు, HRC కి ఫిర్యాదు
  అమ్మాయికి 74 శాతం మార్కులు

  అమ్మాయికి 74 శాతం మార్కులు


  అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటలకు ఇంటర్ పరిక్ష ఫలితాలు వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి 74 శాతం మార్కులతో పాస్ అయ్యిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రేమిస్తున్న యువకుడు టార్చర్ చెయ్యడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఇన్స్ పెక్టర్ యోగేష్ తోమర్ మీడియాకు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి యోగేష్ తోమర్ తెలిపారు.

  English summary
  College girl: 19 year old girl committed suicide due to love torture in Indore in Madhya Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X