వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడ సేఫ్ కాదని గుడిలోకి తీసికెళ్లి మిత్రులతో గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇండోర్: నిర్మాణంలో ఉన్న ఓ శివాలయంలో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ ధామ్నోద్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారంనాడు ఈ దురాగతం చోటు చేసుకుంది.

పాట్లవాద్ గ్రామంలో తన మిత్రుడిని కలవడానికి కాలేజీ విద్యార్థిని వచ్చింది. అతని కోసం బస్టాప్‌లో కూర్చుని వేచి చూస్తోంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఇక్కడ సురిక్షతం కాదని, దగ్గరలో ఉన్న గుడిలోకి వెళ్లి కూర్చోవాలని చెప్పాడు.

అతని మాటలు నమ్మి వెళ్లింది...

అతని మాటలు నమ్మి వెళ్లింది...

అతని మాటలు నమ్మి ఆ అమ్మాయి నిర్మాణంలో ఉన్న శివాలయంలోకి వెళ్లి కూర్చుంది. ఆ ఆగంతకుడు తన ఇద్దరు స్నేహితులకు సైగ చేశాడు. వాళ్లు కూడా ఆలయంలోకి వెళ్లారు. అక్కడే ఆమెపై వారు అత్యాచారం జరిపి పారిపోయారు.

పోలీసు స్టేషన్లో ఫిర్యాదు

పోలీసు స్టేషన్లో ఫిర్యాదు

జరిగిన ఘోరం నుంచి తేరుకున్న అమ్మాయి తనకు అన్యాయంపై పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ముగ్గురిలో ఒకరికి బైక్ ఉంది. ఆ బైక్‌పై సంజు బాబా అనే స్టిక్కర్ ఉంది.ఆ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పింది.

అదుపులోకి తీసుకుని విచారించగా...

అదుపులోకి తీసుకుని విచారించగా...

బాధితురాలు చెప్పిన వివరాలతో సంజయ్ పటేల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిచారడు. దీంతో అతను నేరాన్ని అంగీరించాడు. మిగిలిన ఇద్దరి పేర్లు కూడా చెప్పాడు. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు అఖిలేష్ పటేల్, మహదేవ్ పాటిదార్.

సెటిల్ చేసుకోవడానికి వచ్చి...

సెటిల్ చేసుకోవడానికి వచ్చి...

తన ప్రియుడితో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి 23 ఏళ్ల బాధితురాలు అక్కడికి వచ్చింది. తనపై దురాగతం జరిగిన తర్వాత ఆమె తన మిత్రుడికి ఫోన్ చేసింది. అయితే, అది స్విచాఫ్ అయి ఉంది. మరో ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తే పోలీసులను పిలిచారు.

English summary
A 23-year-old college student was raped by three persons in a temple in an isolated area of Dhar district in MP on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X