వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

College Girl: ప్రియురాలి హత్య, అమ్మాయి తల్లి, మరో యువకుడు ఎంట్రీ, సినిమా ట్విస్ట్, హర్రర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పుదుకోటై: కొన్ని సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రేమికులు ఆందోళన చెందారు. పెద్దలకు ఇష్టం లేని వివాహం చేసుకోవాలని నిర్ణయించిన ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. అయితే సినిమా స్టోరీ ట్విస్ట్ లా వీరి ప్రేమకథలో అమ్మాయి తల్లితో ఓ సమస్య ఎదురైయ్యింది. మేజర్ అయిన అమ్మాయి వివాహం ఇష్టం లేకుండా చెయ్యకూడదని పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయి తల్లి, మరో యువకుడి ఎంట్రీతో కథ మొత్తం అడ్డం తిరిగింది. చివరికి ప్రియురాలు శవమైయ్యింది. తన ప్రియురాలిని ఆమె తల్లి, బంధువులు చంపేశారని ప్రియుడు కేసు పెట్టడంతో థ్రిల్లర్ సినిమాను తలతన్నే హర్రర్ మర్డర్ వ్యవహారం వెలుగు చూసిందని పోలీసులు అంటున్నారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని పుదుకోటై జిల్లా అలంగుడి సమీపంలోని తిరువారంకులం ప్రాంతంలో సావిత్రి (20) అనే యువతి నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం సావిత్రి తండ్రి నాగేశ్వర్ మరణించాడు. పుదుకోటైలోని ప్రభుత్వ మహిళా కాలేజ్ లో సావిత్రి బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. కొప్పకొలై ప్రాంతంలో నివాసం ఉంటున్న వివేక్ (20) అనే యువకుడు పెయింట్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సావిత్రికి, వివేక్ కు నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది.

పెళ్లి చేసుకుందాం...రా !

పెళ్లి చేసుకుందాం...రా !

వివేక్, సావిత్రి గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. సావిత్రి తండ్రి చనిపోయాడని తెలుసుకున్న వివేక్ ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. తన తల్లి శాంతి (45)కి ఒక మాట చెప్పి పెళ్లి చేసుకుందామని సావిత్రి ప్రియుడు వివేక్ కు నచ్చచెప్పింది. ప్రియురాలి తల్లి శాంతి అంగీకారంతోనే పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు వివేక్ ఓకే అన్నాడు.

రెచ్చిపోయిన తల్లి, లేచిపోయిన కూతురు

రెచ్చిపోయిన తల్లి, లేచిపోయిన కూతురు

వివేక్ ను వివాహం చేసుకుంటానని సావిత్రి ఆమె తల్లికి చెప్పింది. అయితే వారి పెళ్లికి తల్లి శాంతి అంగీకరించలేదు. ఈ విషయంలో తల్లి శాంతి, కూతురు సావిత్రికి గొడవలు జరిగాయి. ఇక లాభం లేదని శాంతి కూతురు సావిత్రి నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. ప్రియుడు వివేక్ తో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని సావిత్రి నిర్ణయించింది.

పోలీసులు ఎంట్రీ

పోలీసులు ఎంట్రీ

తన కుమార్తె సావిత్రి కనపడటం లేదని తల్లి శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సావిత్రి, వివేక్ కోసం గాలించారు. స్నేహితులతో కలిసి పెళ్లి చేసుకోవడానికి ప్రేమికులు సావిత్రి, వివేక్ కారులో బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓ చెక్ పోస్టు దగ్గర సావిత్రి, వివేక్, వారి స్నేహితులు వెలుతున్న కారును అడ్డగించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

సినిమా ట్విస్ట్ తో షాక్

సినిమా ట్విస్ట్ తో షాక్

పోలీసుల విచారణలో శాంతి మేజర్ అని వెలుగు చూసింది. అయితే పెళ్లి కొడుకు వివేక్ కు ఇంకా 21 ఏళ్లు నిండలేదని, అతను పెళ్లి చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలలు తక్కువ వయసు ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. శాంతికి ఇష్టం లేని పెళ్లి చెయ్యకూడదని, నాలుగు నెలలు పూర్తి అయిన తరువాత వివేక్ తో ఆమె పెళ్లి జరిపించాలని అమ్మాయి కుటుంబ సభ్యులకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

సావిత్రికి చిత్రహింసలు

సావిత్రికి చిత్రహింసలు

కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో సావిత్రికి ఇష్టం లేని పెళ్లి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆమె తల్లి శాంతికి వార్నింగ్ ఇచ్చారు. మీరు చెప్పినట్లే చేస్తానని పోలీసులను నమ్మించిన శాంతి కుమార్తె సావిత్రిని ఇంటికి తీసుకెళ్లింది. అయితే సావిత్రికి ఆమె తల్లి శాంతి, వారి బంధువులు చిత్రహింసలు పెట్టారు. సావిత్రికి మరో యువకుడికి పెళ్లి చెయ్యడానికి సిద్దం చేశారు. మరో యువకుడితో పెళ్లి చేసుకోనని ఎదురుతిరిగిన సావిత్రికి నరకం చూపించి చివరికి ఆమెను చంపేశారు. చివరికి సావిత్రి శవానికి గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అంత్యక్రియులు పూర్తి చేసి చేతులు దులుపేసుకున్నారు.

ప్రియురాలి కోసం ప్రియుడు

ప్రియురాలి కోసం ప్రియుడు

తన ప్రియురాలు సావిత్రి కనపడటం లేదని, ఆమెను చంపేశారని ప్రియుడు వివేక్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి సావిత్రి తల్లి శాంతిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సావిత్రి ఎక్కడికో వెళ్లిపోయిందని మాకు ఏమీ తెలీదని శాంతి కేసు విచారణ చేస్తున్న పోీలసులకు మాయమాటలు చెప్పింది. అయితే సావిత్రి చనిపోయిందని, ఆమె అంత్యక్రియలు జరిగిపోయాయని ఊరి ప్రజలు పోలీసులకు చెప్పారు.

Recommended Video

Sushant Singh Rajput : MS Dhoni Didn't React On His Biopic Hero Why ?
తల్లి, బంధువులకు బెండ్ తీస్తే

తల్లి, బంధువులకు బెండ్ తీస్తే

పోలీసులు బెండ్ తియ్యడంతో సావిత్రి తల్లి శాంతి అసలు విషయం బయటకు చెప్పింది. సావిత్రికి చిత్రహింసలు పెట్టి ఉరి వేసి మేమే దారుణంగా చంపేశామని ఆమె తల్లి శాంతి అంగీకరించింది. సావిత్రి హత్య కేసులో ఆమె తల్లి శాంతితో పాటు బంధువులు పెరియమ్మాల్, విజయ, మామ మురుగన్, పెరియప్ప సడేసన్, తయ్యామామ, చిదంబరం అనే 7 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రియురాలు సావిత్రి హత్యకు గురి కావడంతో ఆమె ప్రియుడు వివేక్ కుమిలిపోతున్నాడు.

English summary
College Girl horror murder: 21 year old girl murder and seven arrested near Pudukottai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X