వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: యూనివర్శిటీ హాస్టల్‌లో.. విద్యార్థినులను వివస్త్రలను చేసి.. ఆ వార్డెన్ ఏం చేసిందంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం ఆవరణలోని రాణీ లక్ష్మీభాయ్ హాస్టల్‌లోచోటుచేసుకున్న దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. హాస్టల్ వార్డెన్‌, కేర్ టేకర్ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

జరిగిన దారుణంపై విద్యార్థినులంతా కలిసి యూనివర్శిటీ ఉప కులపతి ఆర్పీ తివారీకి ఫిర్యాదు చేయగా, ఆయన హాస్టల్‌ని సందర్శించి, జరిగిన ఘోరం గురించి విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

బాత్రూమ్ బయట...

బాత్రూమ్ బయట...

రాణీ లక్ష్మీభాయ్ హాస్టల్‌‌లోని ఓ బాత్రూమ్ బయట వాడిపారేసిన శానిటరీ నా‌ప్‌కిన్ వార్డెన్‌కు కనిపించింది. దీంతో హాస్టల్‌లోని విద్యార్థినులందరినీ వార్డెన్ ఒకచోటికి పిలిపించింది. అది ఎవరిదో, దాన్ని అక్కడెందుకు వదిలేశారో చెప్పాలంటూ ప్రశ్నించింది. దాదాపు 40 మంది విద్యార్థినులను ఒక సమూహంగా నిల్చోబెట్టి అదెవరిదో చెప్పేవరకు అక్కడ్నించి కదలడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

ఒక్కొక్కరుగా బట్టలు విప్పాలని...

ఒక్కొక్కరుగా బట్టలు విప్పాలని...

వార్డెన్ ప్రవర్తన విద్యార్థినుల్లో భయాందోళనలు కలిగించింది. వారంతా భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడంతో ఇక ఇలా లాభం లేదనుకున్న వార్డెన్ అందరూ ఒక్కొక్కరుగా బట్టలు విప్పాలని గద్దించింది. హాస్టల్‌ వార్డెన్‌తోపాటు కేర్‌టేకర్ కూడా చివరికి వారి లోదుస్తులను కూడా పరిశీలించే ప్రయత్నం చేసింది.

 వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థినులు...

వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థినులు...

దాదాపు యాభై మంది విద్యార్థినులను వివస్త్రలను చేయడమేకాక.. చవిరికి వారి లోదుస్తులు కూడా పరిశీలించే ప్రయత్నం చేయడంతో ఆ విద్యార్థినులంతా ఖిన్నులయ్యారు. హాస్టల్ వార్డెన్‌తో పాటు కేర్ టేకర్ కూడా కటువుగా ప్రవర్తించడంతో బెదిరిపోయిన కొంతమంది విద్యార్థినులు వెక్కి వెక్కి ఏడ్చారు.

ఉప కులపతికి విద్యార్థినుల ఫిర్యాదు...

ఉప కులపతికి విద్యార్థినుల ఫిర్యాదు...

ఈ దారుణం జరిగిన మర్నాడు కొంతమంది విద్యార్థినులు ధైర్యం కూడగట్టుకుని తమకు జరిగిన అవమానం గురించి యూనివర్శిటీ ఉప కులపతి ఆర్పీ తివారీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆయన హాస్టల్‌ని సందర్శించి, జరిగిన ఘోరం గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

తప్పించుకురే ధోరణిలో దోషులు...

తప్పించుకురే ధోరణిలో దోషులు...

ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు హాస్టల్ విద్యార్థినులు నిరాకరించడం గమనార్హం. జరిగిన దారుణంపై ఉప కులపతి ఆర్పీ తివారీ విద్యార్థినులకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. ఇంతజరిగినా హాస్టల్ వార్డెన్‌తోపాటు కేర్ టేకర్ మాత్రం తాము విద్యార్థినుల పట్ల అలా ప్రవర్తించలేదని, తమకేపాపం తెలియదని చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

English summary
In a disturbing incident, at least 40 girls, residing in one of the hostels of Dr Hari Singh Gour University in Madhya Pradesh's Sagar, have alleged that a hostel warden strip-searched them after a used sanitary napkin was found lying in the hostel premises. The students, belonging to Rani Lakshmibai hostel, have raised a complaint with the vice-chancellor of the University against a caretaker and the hostel warden for body-searching them after a used sanitary pad was found lying outside a bathroom. The girls have alleged that they were asked to assemble at a place and were then told to remove their clothes, including their undergarments.The students claimed that the warden had issued the outrageous diktat to determine who among the girls was menstruating and could have left a used pad outside, reports said. Meanwhile, condemning the incident, Vice Chancellor RP Tiwari apologised to the students, assuring that strict action would be taken against those found guilty. Speaking to ANI, he said, "It's unfortunate and condemnable. I told students that they are all like my daughter and I apologise to them."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X