వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు లేడీ ప్రొఫెసర్ సెక్స్ పాఠాలు: హైకోర్టు డెడ్ లైన్, బెయిల్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు అధికారులకు లైంగిక సుఖం ఇస్తే మంచి మార్కులు వేస్తారని, డబ్బులు ఇస్తారని కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ కేసు విచారణ త్వరగా పూర్తి చెయ్యాలని మద్రాసు హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది.

సీబీ సీఐడీ అధికారులు

సీబీ సీఐడీ అధికారులు

సెప్టెంబర్ 10వ తేదీ చివరి చార్జ్ షీట్ కోర్టులో సమర్పించాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు సీబీ- సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన మదురై కామరాజర్ యూనివర్శిటీ స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామికి బెయిల్ ఇవ్వడానికి మద్రాసు హైకోర్టు నిరాకరించింది.

Recommended Video

నిర్మలాదేవి వ్యవహరంపై మాజీ ఐఎఎస్ అధికారి సంతానం కమిటీ విచారణ
విద్యార్థుల సాక్షం

విద్యార్థుల సాక్షం

ఈ కేసులో కాలేజ్ విద్యార్థుల సాక్షం బలంగా ఉందని, సీబీ- సీఐడీ అధికారులు చివరి చార్జ్ షీట్ సమర్పించే వరకు తాము బెయిల్ మంజూరు చెయ్యలేమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జీఆర్. స్వామినాథన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆరు నెలలు

ఆరు నెలలు

కేసు నమోదు అయిన ఆరు నెలలలోపు చివరి చార్జ్ షీట్ సమర్పించడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ 10వ తేదీలోపు కేసు విచారణ పూర్తి చేసి విరూద్ నగర్ కోర్టులో చార్జ్ షీట్ సమర్పించాలని తమిళనాడు సీబీ- సీఐడీ అధికారులకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థులకు సెక్స్ పాఠాలు

విద్యార్థులకు సెక్స్ పాఠాలు

తమిళనాడులోని అరుప్పుకోటై లోని దేవాంగ ఆర్ట్స్ కాలేజ్ లో అసిస్టెంట్ లేడీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న నిర్మలా దేవి కొందరు విద్యార్థినిలకు పై అధికారులకు లైంగిక సుఖం ఇస్తే ఎక్కువ మార్కులు వేస్తారని, మీ బ్యాంకు అకౌంట్ లో నగదు డిపాజిట్ చేస్తారని, ఈ విషయం బయటకురాకుండా తాను చూసుకుంటానని సెక్స్ పాఠాలు చెప్పి వారిని బలవంతంగా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

నిర్మలా దేవి చెప్పిన సెక్స్ పాఠాల ఆడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏప్రిల్ 16వ తేదీన నిర్మలా దేవిని సస్పెండ్ చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.

బెయిల్ ఇవ్వలేం

బెయిల్ ఇవ్వలేం

విద్యార్థినిలను మభ్యపెట్టి వారిని వ్యభిచారకూపంలోకి నెట్టడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ నిర్మలా దేవితో పాటు మదురై కామరాజర్ యూనివర్శి ప్రొఫెసర్ మురుగన్, స్కాలర్ విద్యార్థి కరుప్పుస్వామిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. వీరు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించగా తాము జామీను ఇవ్వలేమని కోర్టులు స్పష్టం చేశాయి.

English summary
The Madras High Court set a deadline of September 10 for the CB-CID to file its final charge sheet in the case of a woman professor who allegedly tried to 'lure' students to extend sexual favours to some varsity officials for marks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X