కాలేజ్ స్టూడెంట్ టార్గెట్: అమ్మాయిలు, ఆంటీల నడుముతో తిక్కతిక్క టిక్ టాక్ వీడియోలు, పరుగో పరుగు !
చెన్నై/ తిరుచ్చి: టిక్ టాక్ పిచ్చితో తిక్కతిక్కగా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న యువకుడిని తమిళనాడులో అరెస్టు చేశారు. అమ్మాయిలతో తిక్కచేష్టలు చెయ్యడం, ఆంటీలతో డ్యాన్స్ లు చేస్తూ వారి నడుములను వంకరగా వీడియోలు తీస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. బస్ స్టాండ్ లతో పాటు రైల్వేస్టేషన్ ల్లో ప్రజలను భయపెట్టడం, చివరికి అవ్వలను కూడా వదలకుండా వెకిలి చేష్టలు చేస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకుని బెండ్ తీశారు.
ఎదురింటి ఆంటీతో బెడ్ రూంలో రొమాన్స్, పక్క గదిలో భర్త, నగ్నంగా చూసి ఇద్దర్నీ అడ్డంగా నరికేశాడు !
టిక్ టాక్ తో హల్ చల్
తమిళనాడులోని పుదుకోటై కొత్త బస్ స్టాండ్, తిరుచ్చి రైల్లేస్టేషన్, తిరుచ్చి బస్ స్టాండ్ తదితర చోట్ల ఓ యువకుడు టిక్ టాక్ వీడియోలతో తిక్కతిక్క చేష్టలు చేశాడు. ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. ఎవరైనా అతన్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే చాకచక్యంగా మాయమాటలతో అక్కడి నుంచి తప్పించుకోవడం మొదలు పెట్టాడు.
అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్
బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్ల దగ్గర, చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న అందమైన అమ్మాయిలు, ఆంటీలను ఢీకొట్టి టిక్ టాక్ వీడియోలు తీసిన ఆ యువకుడు హల్ చల్ చేశాడు. ఆ యువకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో అతని ఆగడాలు అరికట్టాలని నిర్ణయించిన స్థానికులు జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎవడు వాడు, ఎక్కడి వాడు ?
జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. టిక్ టాక్ వీడియోలు తీస్తున్న యువకుడి కోసం గాలించారు. చివరికి కరుక్కానుకురుచ్చి ప్రాంతానికి చెందిన కన్నన్ (21) అనే యువకుడిని అరెస్టు చేశారు. కన్నన్ ను అరెస్టు చేసిన సమయంలో పక్కనే అతని టిక్ టాక్ వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారైనారు.
అమ్మాయిలు, ఆంటీల నడుములు
అందమైన ఆంటీలను ఢీకొట్టి వారిని పలకరిస్తూ ఆడుతూ పాటలు పాడుతున్న కన్నన్ వారికి తెలీకుండా వారి నడుము వయ్యారాలను వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. కన్నన్ పుదుకోటైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడని పుదుకోటై పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
తిక్కతో వీడు ఎవ్వర్నీ వదల్లేదు
కన్నన్ అమ్మాయిలు, ఆంటీలతో పాటు ముసలి వాళ్లను కూడా వదలకుండా వారితో డ్యాన్స్ లు చేస్తూ తిక్కతిక్కగా టిక్ టాక్ వీడియోలు తీశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కన్నన్ ను విచారణ చేస్తున్నామని, ఇతనికి ఎంత మంది సహకరించారు?, టిక్ టాక్ వీడియోలు ఎన్ని తీశారు ? అని ఆరా తీస్తున్నామని పుదుకోటై పోలీసులు తెలిపారు.