College: ఫేమస్ నర్సింగ్ కాలేజ్, కరస్పాండెంట్, ఉద్యోగులు కలిసి అమ్మాయిలను ?, లేడీ కిలాడి !
కోయంబత్తూరు/చెన్నై: ప్రముఖ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో చేరడానికి అమ్మాయిలు ఇంతకాల పోటీపడేవాళ్లు. ఆ కాలేజ్ లో చదువుకుంటే మంచి ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం వస్తుందని చాలా మంది ఆశపడుతూ ఆ కాలేజ్ లో చేరుతున్నారు. ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో అందమైన అమ్మాయిలు చదువుతున్నారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయిల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నా ఆ కాలేజ్ యాజమాన్యం అలాంటి ఆరోపణలు కొట్టి వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల అదే కాలేజ్ లో చదువుతున్న 17 ఏళ్ల యువతి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది. కాలేజ్ కరస్పాండెంట్ తోపాటు ఇద్దరు లెక్చరర్స్ తో పాటు మరో లేడీ లెక్సరర్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.
Lady
owner:
లంచం
ఇస్తావా
?,
మంచం
మీదకు
వస్తావా
?,
ఇంటి
యజమానితో
సీఐ
సెటైర్లు,
క్లైమాక్స్
లో!

దెబ్బతో ప్రభుత్వం ఎంట్రీ
తమిళనాడులో ఇటీవల కొన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల మీద లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని కొన్నిసార్లు వెలుగు చూసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని ప్రముఖ స్కూల్ లో ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో టీచర్ ను అరెస్టు చేశారు. చెన్నై స్కూల్ విషయంలో పెద్దరాద్దాంతం జరగడంతో తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే.

ఫేమస్ నర్సింగ్ కాలేజ్
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పన్రూటిలో ప్రముఖ నర్సింగ్ కాలేజ్ ఉంది. పన్రూటీలోని ప్రముఖ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో చేరడానికి తమిళనాడులోని అనేక జిల్లాలకు చెందిన అమ్మాయిలు ఇంతకాల పోటీపడేవాళ్లు. ఆ కాలేజ్ లో చదువుకుంటే మంచి ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం వస్తుందని చాలా మంది ఆశపడుతూ పన్రూటిలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో చేరుతున్నారు.

అందమైన అమ్మాయిలు.... ఖండించిన కాలేజ్ యాజమాన్యం
కడలూరు జిల్లాలోని పన్రూటీ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో అందమైన అమ్మాయిలు చదువుతున్నారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయిల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం ఆ కాలేజ్ కరస్పాండెంట్ డేవిడ్ అశోక్ కుమార్ అలాంటి ఆరోపణలను ఇంతకాలం కొట్టి వేస్తూ వచ్చారు.

అమ్మాయి ఆత్మహత్యాయత్నం
పన్రూటీ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయిలు వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించి సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. లైంగిక వేధింపుల కారణంగా ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కామాంధులు అరెస్టు
కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. పన్రూటీ ప్రైవేట్ కాలేజ్ కరస్పాండెంట్ డేవిడ్ అశోక్ కుమార్ అలియాస్ డేవిడ్ (39), అదే కాలేజ్ లో టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న అన్బళగన్ (32), పచ్చంకుప్పం నివాసి ఎం ప్రేమ్ కుమార్ (380, కానై నివాసి కే, నిషా (32) అనే లేడీని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

మొత్తం ముగ్గురు అమ్మాయిల మీద ?
అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరగడం వలనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని, మరో ఇద్దరు అమ్మాయిలు కూడా లైంగిక వేధింపులకు గురైనారని వెలుగు చూసిందని, నిందితుల మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని కడలూరు పోలీసు అధికారులు అంటున్నారు. అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరగడానికి కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న లేడీ కూడా సహకరించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.