వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెకండ్ల వ్యవధిలో తప్పిన ప్రమాదం, ఒకే రన్ వేలో రెండు విమానాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి తప్పించుకున్న గోఎయిర్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆ సమయంలో వందమంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ సంఘటన గత వారం చోటు చేసుకుంది.

గో ఎయిర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అదే రన్ వే పైకి ఓ ప్రయివేటు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది. కొన్ని సెకండ్ల తేడాలో రెండు విమానాలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు.

Collision of GoAir, private jet averted by seconds at Delhi’s IGI airport

మే మూడో తేదీన గో ఎయిర్‌ విమానం ల్యాండ్‌ అవుతుండగా పైలట్‌ రన్‌వేపై మరో ప్రయివేటు విమానంను గుర్తించారు. అయితే విమానం ల్యాండ్‌ అవ్వడానికి కేవలం సెకన్ల ముందు ఆ ప్రయివేటు విమానం గో ఎయిర్‌ విమానం ముందు నుంచి వెళ్లిపోయింది. అది కొన్ని క్షణాలు ఆలస్యమైతే రెండు విమానాలు ఢీకొట్టుకునేవి.

గో ఎయిర్‌ విమాన పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్ సూచనలు సరిగ్గా పాటించలేదని అధికారులు చెప్పారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా స్టాప్‌ బార్‌ దాటేసి ఆ విమానం వచ్చిందన్నారు. దీనిపై గో ఎయిర్‌ స్పందించింది. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేస్తోందని, తాము విచారణకు విధాలా సహకరిస్తామని తెలిపారు.

English summary
A major disaster was averted at the Indira Gandhi International Airport last week after a GoAir flight, with over 100 passengers aboard, narrowly avoided collision with a chartered plane at the runway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X