వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దాడిలో తెలుగు అధికారి మృతి.. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట.. అంతటా విషాదం..

|
Google Oneindia TeluguNews

శాంతిచర్చల మాటున చైనా కొట్టిన దొంగదెబ్బకు భరతమాత బిడ్డల్లో ముగ్గురు నేలకొరిగారు. లదాక్ సరిహద్దులో చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో బాహాబాహీలో ఓ కల్నల్ స్థాయి అధికారితోపాటు ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. ఆయా కుటుంబాలకు ఆర్మీ వర్గాలు సమాచారం అందజేశాయి.

Recommended Video

#IndiaChinaFaceOff : India - China సరిహద్దు దాడుల్లో Telangana కు చెందిన తెలుగు అధికారి మృతి!
ఆ కల్నల్ తెలుగువారే..

ఆ కల్నల్ తెలుగువారే..


భారత్‌-చైనా సరిహద్దులలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న దాడుల్లో మనవైపు ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు.. చైనా వైపు ఐదుగురు జవాన్లు చనిపోగా, రెండు వైపులా కలిపి పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘర్షణలో నేలకొరిగిన ముగ్గురిలో కల్నల్ సంతోష్ బాబు తెలంగాణకు చెందినవారు. సూర్యాపేటలోని ఆయన ఇంటికి మంగళవారం సైనికవర్గాల నుంచి ఈ మేరకు సమాచారం అందింది.

చైనా బరితెగింపు.. 45 ఏళ్ల శాంతి బద్దలు.. ఆర్మీ బలగాల హత్యలపై బుకాయింపు.. ఇండియాదే తప్పంటూ..చైనా బరితెగింపు.. 45 ఏళ్ల శాంతి బద్దలు.. ఆర్మీ బలగాల హత్యలపై బుకాయింపు.. ఇండియాదే తప్పంటూ..

ఏడాదిగా ఎల్ఏసీలో..

ఏడాదిగా ఎల్ఏసీలో..


కమాండింగ్ ఆఫీసర్ స్థాయిలో కల్నల్ సంతోష్ బాబు ఏడాది కాలంగా భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద విధులు నిర్వహిస్తున్నారు. బీహార్ 16వ బెటాలియన్ కు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తూర్పు లదాక్ లో కీలక పాయింట్లుగా భావించే పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్, గాల్వాన్ లోయ ప్రాంతాలను ఆక్రమించే ఎత్తుగడతో చైనా.. దాదాపు నెలన్నరగా కవ్వింపులకు పాల్పడుతుండటం తెలిసిందే. సోమవారం రాత్రి.. గాల్వాన్ లోయలో కల్నల్ సంతోష్ బృందంతోనే చైనా సైన్యాలు తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఆయనతోపాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయారు.

సరిహద్దులో చైనా కిరాతకం గుర్తుందా? గొర్రెలమంద, పొగమంచు మాటున కాల్పులు.. మళ్లీ ఇన్నాళ్లకు మరణాలు..సరిహద్దులో చైనా కిరాతకం గుర్తుందా? గొర్రెలమంద, పొగమంచు మాటున కాల్పులు.. మళ్లీ ఇన్నాళ్లకు మరణాలు..

హైదరాబాద్ కు బదిలీ అయినా..

హైదరాబాద్ కు బదిలీ అయినా..


ఏడాది కాలంగా చైనా సరిహద్దలో డ్యూటీ చేస్తోన్న కల్నల్ సంతోష్ బాబు.. మూడు నెలల కిందటే హైదరాబాద్ బదిలీ అయ్యారు. అయితే లాక్ డౌన్ కారణంగా లాదాక్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోపు సరిహద్దు వెంబడి చైనా బలగాలను మోహరించడం.. అదే స్థాయిలో భారత్ కూడా జవాన్లను తరలించడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కల్నల్ సంతోష్ బాబు కీలకమైన గాల్వాన్ లోయలో విధులు నిర్వర్తిస్తూ చివరికి దేశం కోసం ప్రాణాలు విడిచారు.

సూర్యాపేటలో విషాదం..

సూర్యాపేటలో విషాదం..


కల్నల్ సంతోష్ బాబు చనిపోయారంటూ ఆర్మీ వర్గాల నుంచి సమాచారం అందిన తర్వాత ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. బంధువులు, పరిచయస్తులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో కల్నల్ ఇంటికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చే ప్రయత్నం చేశారు. దివంగత కల్నల్ కు భార్య సంతోషి, కూతురు అభిజ్ఞ(9), కొడుకు అనిల్ తేజ్ ‌(6) ఉన్నారు.

English summary
The violent face-off with the Chinese soldiers resulted in the martyrdom of a senior officer of the Indian Army hailing from Suryapet town of Telangana. Colonel Santosh Babu along with two soldiers attained martyrdom in the skirmish at Galwan Valley in Ladakh last night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X