వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా ప్రపంచం నుండి బయటికి రా...! మాంద్యానికి, సినిమాకు లింకేంటీ...? ప్రియాంక గాంధీ

|
Google Oneindia TeluguNews

దేశంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యాన్ని సినిమాలతో పోల్చి మాట్లాడిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఈనేపథ్యంలోనే మంత్రి రవిశంకర్ ప్రసాద్ సినిమా ప్రపంచం నుండి వాస్తవప్రపంచంలోకి రావాలాని ఆమే కోరారు. మంత్రి స్థాయిలో ఉండి ఆర్ధికమాంద్యం గురించి అలా మాట్లాడడం చాల దురదృష్టకరమని ఆమే అన్నారు.

ప్రియాంక గాంధీకి ఆ దేశ ప్రధాని ఆత్మీయ ఆలింగనంప్రియాంక గాంధీకి ఆ దేశ ప్రధాని ఆత్మీయ ఆలింగనం

దేశంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యం వల్ల పలు రంగాల్లో లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. ఇక ప్రజల డబ్బులను బ్యాంకుల్లో స్థంభింప చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆందోళన, బాధ గురించి ప్రభుత్వం కొంచెం కూడ ఆలోచించడం లేదని అన్నారు. ఇక సినిమాలుఎప్పుడు కూడ లాభాపేక్ష మీదనే ఆధారపడతాయని ప్రియాంక గాంధి ట్విట్టర్‌లో పేర్కోన్నారు.

 Come Out Of Film World, Priyanka Gandhi Attacks Ravi Shankar

దేశంలో నెలకొన్న ఆర్ధికమందగమనంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే... భారత దేశంలో ఆర్దిక మందగమనం లేదని ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని వ్యాఖ్యానించారు. ఆక్టోబర్‌ 2న విడుదలైన మూడు సినిమాలు ఒక్కరోజే 120 కోట్ల రుపాయాలు వసూలు చేశాయని అన్నారు. ఆర్ధిక మందగమనం లేదనడానికి సినిమాల కలెక్షన్లే నిదర్శమని అన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆర్ధిక మందగమనం గురించి స్పందించాలని కోరడంతో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి.కాగా అక్టోబర్ రెండున జాతీయవ్యాప్తంగా విడుదలైన సైరా తోపాటు వార్, మరియు జోకర్ సినిమాలు విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

English summary
Priyanka Gandhi has slammed Union Law Minister Ravi Shankar Prasad over his comments linking Bollywood to the economy and dismissing an economic slowdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X